Begin typing your search above and press return to search.

పిక్ టాక్: సీటీమార్ అంటున్న డైనమిక్ హీరో..!

By:  Tupaki Desk   |   12 Jun 2021 6:32 AM GMT
పిక్ టాక్: సీటీమార్ అంటున్న డైనమిక్ హీరో..!
X
డైనమిక్ హీరో గోపీచంద్‌ - మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కలిసి నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ''సీటీమార్‌''. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక - దిగంగనా సూర్యవంశీ - అప్సర రాణి కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌ పాత్రలో గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్‌ పాత్రలో తమన్నా నటించారు. ఇప్పటికే విడుదల చేయబడిన పోస్టర్స్ - టీజర్ - 'జ్వాలారెడ్డి' సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

'సీటీమార్' నుంచి వచ్చిన ఈ పోస్టర్ లో గోపీచంద్ విజిల్ వేస్తూ కనిపిస్తున్నాడు. ట్రెండీ కాస్ట్యూమ్స్ తో స్టైలిష్ గా ఉన్నాడు. మ్యాచో స్టార్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ సీటీమార్ టీమ్ విడుదల చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగా, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో రెహమాన్ - రావు రమేష్ - తరుణ్ అరోరా - పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'సీటీమార్' సినిమా వాయిదా పడింది.