Begin typing your search above and press return to search.

బీచ్ ఇసుక‌లో మెరిసిపోతున్న‌ దిశా అయిలీ టోన్డ్ బాడీ

By:  Tupaki Desk   |   13 Jun 2021 7:46 AM GMT
బీచ్ ఇసుక‌లో మెరిసిపోతున్న‌ దిశా అయిలీ టోన్డ్ బాడీ
X
దిశా ప‌టానీ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ గురించి తెలిసిందే. ఇటీవ‌ల లాక్ డౌన్ స‌మయంలో మాల్దీవుల విహారం నుంచి వేడెక్కించే బికినీ ఫోటోల‌ను వీడియోల‌ను షేర్ చేయ‌గా ఇంట‌ర్నెట్ లో దుమారం రేపాయి. తాజాగా ఈ బ్యూటీ బీచ్ వెకేష‌న్ నుండి త్రోబాక్ ఫోటోను షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

పింక్ బికినీ ధరించి దిశా సముద్రపుటంచున‌ మెరిసే నీటి ముందు కూర్చుని క‌నిపిస్తోంది. దిశా టోన్డ్ బాడీని పొడుగు కాళ్ల అందాల‌ను ఎలివేట్ చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది. దిశా ఎండ‌లో చెమ‌ట‌లు ప‌ట్టి ఆయిలీ టోన్డ్ లుక్ తో మెరిసిపోతోంది. ఇంతకుముందు దిశా డిన్న‌ర్ డేట్ కి సంబంధించిన‌ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. నల్లని దుస్తులలో ధరించిన దిషా మేకప్ లేకుండా తన సహజ సౌంద‌ర్యంతో ఆక‌ట్టుకుంది. దిశా షేర్ చేస్తున్న ప్ర‌తి ఫోటోకి కుటుంబం.. స్నేహితులు.. అభిమానుల నుండి కామెంట్లు ఈమోజీలు షేర్ అవుతున్నాయి.

స‌ల్మాన్ - దిశా జంట‌గా న‌టించిన రాధే ఇటీవ‌లే రిలీజై డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో దిశా కొంత నిరాశ‌కు గురైంది. కానీ త‌దుప‌రి ప‌లు భారీ చిత్రాల్లో దిశా క‌నిపించ‌నుంది. తదుపరి ఏక్ విలన్ రిటర్న్స్ లో క‌నిపించ‌నుంది. మోహిత్ సూరి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో దిశాతో పాటు జాన్ అబ్రహం- అర్జున్ కపూర్ - తారా సుతారియా నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానుంది.