Begin typing your search above and press return to search.

#HBD-AA పుట్టిన‌రోజు కేక్ క్రియేటివిటీ అదిరిందిగా

By:  Tupaki Desk   |   8 April 2021 4:00 PM IST
#HBD-AA  పుట్టిన‌రోజు కేక్ క్రియేటివిటీ అదిరిందిగా
X
బ‌న్ని పుట్టినరోజు ప్ర‌తిసారీ వేరు. ఈసారి వేరు. ఇప్పుడు అత‌డు పాన్ ఇండియా స్టార్ గా మారుతున్నాడు. ఇంత‌కుముందు అతడి సినిమాలు తెలుగు రాష్ట్రాలు కేర‌ళ‌- చెన్న‌య్ - బెంగ‌ళూరు వంటి చోట్ల అద్భుతంగా ఆడాయి. ఇప్పుడు హిందీ మార్కెట్లోనూ త‌మిళ‌నాడు వ్యాప్తంగా ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ రాణించాల‌ని క‌సితో ఉన్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ఆర్య కాంబినేష‌న్ రిపీట‌వుతోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్తి చేసి డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తి చేసేస్తున్నాడు బ‌న్ని.

ఇటీవ‌ల షెడ్యూల్ బ్రేక్ లో అత‌డు మాల్దీవుల‌కు కుటుంబ స‌మేతంగా వెల్లి విహ‌రించారు. అక్క‌డి నుంచి ఫోటోల్ని షేర్ చేసారు. ఏప్రిల్ 8న బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని పుష్ప టీజ‌ర్ లాంచ్ చేయ‌గా.. బ‌న్ని హైద‌రాబాద్ లోని ఈవెంట్లోనూ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అల్లు అర్జున్ తన 38 వ పుట్టినరోజును పరిశ్రమకు చెందిన అభిమానులు.. అనుచరులు శ్రేయోభిలాషులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

బ‌న్నీకి ఇష్ట‌మైన‌ రెండు ప్రత్యేకమైన కేక్ ‌లతో కుటుంబ స‌భ్యులు విషెస్ తెలిపిన విధానం ప్ర‌స్తుతం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. మొదటిది బ‌న్ని సోదరుడు అల్లు శిరీష్‌.. భార్యామ‌ణి స్నేహ కేక్ ల‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ క‌ట్ చేయించారు. ``పుట్టినరోజు శుభాకాంక్షలు ..`` అంటూ శిరీస్‌ ఇన్ స్టాగ్రామ్ లో కేక్ చిత్రాన్ని పంచుకున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా అల్లు అర్జున్ కోసం అద్భుతమైన చాక్లెట్ కేక్ ని బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఈ చిత్రాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. `పుట్టినరోజు శుభాకాంక్షలు అర్జున్` అని విష్ చేశారు. చాక్లెట్ పూత స్ట్రాబెర్రీలతో కప్పబడిన అలంకర‌ణ‌తో చాక్లెట్ కేక్ ఆక‌ట్టుకుంది.

ఇక వీట‌న్నిటినీ మించి పుష్ప‌ టీజర్ విడుదల వేడుకలో కేక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ కేక్ ప్రత్యేక‌త ఏమిటంటే ఇప్ప‌టివ‌ర‌కూ బ‌న్ని న‌టించిన 20 సినిమాల పేర్ల‌తో ఈ కేక్ ని డిజైన్ చేయించారు. భారీ దీర్ఘచతురస్రాకార కేకులో నాలుగు వైపులా AA అనే అక్షరాలు ఉన్నాయి. కేక్ ఉపరితలంపై బ‌న్ని న‌టించిన‌ చిత్రాల పేర్లు ఉన్నాయి. గంగోత్రి- ఆర్య‌-ఆర్య‌2- దేశ‌ముదురు- స‌రైనోడు- జులాయి- రేసుగుర్రం ఇలా.. తాజా చిత్రం పుష్ప వ‌ర‌కూ పేర్ల‌ను ముద్రించారు. ఇది ఎంతో సృజనాత్మక తో ఆక‌ట్టు‌కుంది. పుష్ప‌లో బ‌న్ని లారీ డ్రైవ‌ర్ గా న‌టిస్తుండ‌గా ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం 2021 ఆగస్టు 13 న విడుదల కానుంది.