Begin typing your search above and press return to search.

వీడియో : హీరో కానంటూనే అన్నీ నేర్చేసుకుంటున్న పవన్‌ తనయుడు

By:  Tupaki Desk   |   8 April 2022 2:50 PM GMT
వీడియో : హీరో కానంటూనే అన్నీ నేర్చేసుకుంటున్న పవన్‌ తనయుడు
X
పవన్‌ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి సోషల్‌ మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. అకీరా చాలా సైలెంట్ గా.. ఎవరితో ఎక్కువగా కలువకుండా తనపనేదో తాను చేసుకుంటూ వెళ్తాడు. చిన్నప్పుడు పెద్దప్పుడు ఎప్పుడైనా కూడా అతడి తీరు ఒకే విధంగా ఉంది.. అతడు అప్పుడు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగానే మారుతూ ఉన్నాడు.

తల్లిదండ్రులు పవన్‌ మరియు రేణు దేశాయ్ విడిపోయిన నేపథ్యంలో తల్లి రేణు దేశాయ్‌ వద్ద అకీరా ఉంటున్న విషయం తెల్సిందే. తల్లి వద్ద పెరుగుతున్నా కూడా తండ్రి పవన్ కళ్యాణ్ పై అకీరాకు ప్రత్యేక గౌరవం మరియు అభిమానం ఉంటుంది. అందుకే తరచు తండ్రి పవన్ కళ్యాణ్ తో కనిపిస్తూనే ఉంటాడు. అకీరా విషయంలో కూడా పవన్‌ చాలా శ్రద్ద కనబర్చుతూ ఉంటాడు అనడంలో సందేహం లేదు.

అకీరా కెరీర్‌ లో ఏం కావాలో ముందే నిర్ణయించకుండా అతడి యొక్క ఆసక్తిని.. అభిరుచిని.. ప్రావిణ్యంను గమనించాలని పవన్‌ ఉద్దేశ్యంగా తెలుస్తుంది. అతడు ఏం కావాలనుకుంటే అదే చేసేందుకు పవన్‌ సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్ టాలీవుడ్‌ లో బిగ్‌ స్టార్‌ కనుక ఆయన వారసుడిగా అకీరా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు మరియు మెగా కాంపౌండ్ కు చెందిన వారు కూడా అనుకుంటూ ఉన్నారు.

కొన్నాళ్ల క్రితం రేణు దేశాయ్ మరియు అకీరా ఇద్దరు కూడా సినిమా ల పై ఆసక్తి లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అకీరా సినిమా ల్లో నటించే ఉద్దేశ్యం లేదనే ఉద్దేశ్యంతోనే మాట్లాడుతూ వచ్చాడు. కాని గత కొన్నాళ్లుగా ఆయన కసరత్తులు చూస్తుంటే ఖచ్చితంగా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. హీరోకి కావాల్సిన అన్ని విద్యలను.. పాఠాలను అకీరా నేర్చుకుంటున్నాడు.

పవన్‌ కళ్యాణ్ హీరో అవ్వక ముందు బాక్సింగ్ పై పట్టు సాధించాడు. మార్షల్‌ ఆర్ట్స్ ను కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు అకీరా కూడా ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు అకీరా బాక్సింగ్‌ ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా అకీరా బాక్సింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. రియల్‌ బాక్సర్స్ మాదిరిగా అకీరా నందన్ బాక్సింగ్‌ పంచ్ లు గుప్పిస్తుంటే అంతా అలా కళ్లు తెరచి చూడాల్సిందే.