Begin typing your search above and press return to search.

బిపాసా - క‌ర‌ణ్ ఆరో వార్షికోత్స‌వ వేడుక‌లు

By:  Tupaki Desk   |   1 May 2022 9:30 AM GMT
బిపాసా - క‌ర‌ణ్ ఆరో వార్షికోత్స‌వ వేడుక‌లు
X
బిపాసా బసు - కరణ్ సింగ్ గ్రోవర్ ల ‘మంకీ వెడ్డింగ్’ ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ అభిమానుల హృదయాలను ఆక్రమించి ఆరు సంవత్సరాలు! పూర్తి చేసుకుంది. పెళ్లి నాటి జంట చిత్రాలు తాజాగా వైరల్ అయ్యాయి చూడ‌ముచ్చ‌టైన జంట‌పై నిరంత‌రం ఏదో ఒక చ‌ర్చ సాగుతూనే ఉంది. ఈరోజు ఆరో వార్షికోత్స‌వం జ‌రుపుకున్నారు. నేను ఇప్పుడు అంతకు మించి ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ బిపాసా క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఆరేళ్ల వైవాహిక జీవితం గురించి బిపాసా బసు మాట్లాడుతూ- “నా బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భాగస్వామిగా నేను కోరుకున్నది కరణ్ ని.. దాంతో పాటు మరిన్ని ఉన్నాయి! ఈ ఆరేళ్లు తనతో ఆరు నెలలుగా ఫీలయ్యా.

మీరు గొప్ప సమయాన్ని గడిపినప్పుడు సమయం తెలియ‌దు... ఆ గొప్ప విష‌యం ఏది అంటే అది మా వివాహం! అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది.

వారి ఆరవ వివాహ వార్షికోత్సవం గురించి కరణ్ సింగ్ గ్రోవర్ మాట్లాడుతూ- ``బిపాసా నా పరిపూర్ణ భాగస్వామి. ఆమె ఆహ్లాదకరమైన స్ఫూర్తిదాయ‌క‌మైన ప్రియురాలు. కష్టపడి పనిచేసే త‌త్వం త‌న‌కు ఉంది.

మేం ఒకరినొకరు సమతుల్యం చేసుకుంటాము. మా వివాహం గురించి నేను చాలా ఆనందించాను. మేము ఒకరికొకరు ఎదగడానికి.. అభివృద్ధి చెందడానికి మార్గాలను అన్వేషిస్తున్నాము. మా పెళ్లై ఆరు సంవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నాను!`` అని అన్నారు.

ఇటీవల కరణ్ సింగ్ గ్రోవర్ తనకు బిపాసాకు మ‌ధ్య ఏళ్ల నాటి అందమైన క్షణాలతో ఒక పెళ్లి వీడియోను రూపొందించాడు. అంతే కాదు ఆ వీడియోలోని పాటను కరణ్ సింగ్ గ్రోవర్ పాడారు.