Begin typing your search above and press return to search.

రాళ్ల‌ల్లో, ఇసుక‌ల్లో కొత్త జంట హ‌నీమూన్‌

By:  Tupaki Desk   |   14 May 2016 7:58 AM GMT
రాళ్ల‌ల్లో, ఇసుక‌ల్లో కొత్త జంట హ‌నీమూన్‌
X
ఇటీవ‌లే ఒక్క‌టైన బాలీవుడ్ జంట బిపాసాబ‌సు-క‌ర‌ణ్ త‌మ హ‌నీమూన్‌ ను డిఫ‌రెంట్‌ గా ఎంజాయ్ చేస్తున్నారు. గ‌త నెల 30న పెళ్లి చేసుకున్న ఈ జంట మాల్దీవులులోని బ్యూటీఫుల్ లొకేష‌న్ల‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్క‌డ త‌మ హ‌నీమూన్‌ లోని తీపి గుర్తుల‌ను బిపాసా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌పంచానికి, త‌న అభిమానుల‌కు తెలియ‌జేస్తోంది. వెండితెర మీద బిపాసా హాట్ హాట్‌ గా క‌నిపించేందుకు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌దో త‌న హ‌నీమూన్ ట్రిప్‌ లో కూడా అలాగే హాట్ హాట్ డ్రెస్‌ ల‌తో త‌న భ‌ర్త క‌ర‌ణ్‌ తో క‌లిసి మాల్దీవులు స‌ముద్రం - బీచ్‌ లు - రెస్టారెంట్లో ఎంజాయ్ చ‌స్తోంది.

మ‌ల్దీవుల్లోని స‌ముద్ర కెర‌టాలు - నీలి రంగు నీళ్లు - ఇసుక తెన్నెలు - చ‌ల్ల‌ని సాయంత్రాల్లో త‌న హ‌నీమూన్ లైఫ్ చాలా జాలీగా గుడుస్తోంద‌ని ఫొటోల‌తో స‌హా బిపాసా సోష‌ల్ మీడియాలో అప్‌ లోడ్ చేస్తోంది. బాల‌కృష్ణ సినిమాలోని రాళ్ల‌ల్లో..ఇసుక‌ల్లో రాశాను ఇద్ద‌రి పేర్లు క‌ళ్లుమూసి తిన్న‌గా క‌లిపి చ‌దువుకో అన్న స్టైల్లో ఈ జంట ఇసుకలో రాళ్లతో తమ పేరు రాసుకొంది.

బీచ్‌లో తెల్లని గులకరాళ్లతో 'మంకీ లవ్ 3' అని రాసి ఆ వీడియోను బిపాసా త‌న ఇన్‌ స్టా గ్రామ్ పేజ్‌ లో పోస్ట్ చేసింది. మంకీ ల‌వ్ ఏంట‌నే దానిపై చాలా మంది ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ పేరుతోనే వీరిద్ద‌రు త‌మ పెళ్లి ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో పెట్టారు. బ‌హుశా అది ఈ జంట నిక్‌ నేమ్ అయ్యి ఉండ‌వ‌చ్చ‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఏదేమైనా బిపాసా లేట్ మ్యారేజ్ చేసుకున్నా లేటెస్ట్‌ గా త‌న ఫ్యామిలీ జీవితాన్ని స్టార్ట్ చేసింది.