Begin typing your search above and press return to search.

బయో పిక్ లు వస్తున్నాయి.. బీ రెడీ

By:  Tupaki Desk   |   24 April 2018 10:19 AM IST
బయో పిక్ లు వస్తున్నాయి.. బీ రెడీ
X
టాలీవుడ్.. కోలీవుడ్ లలో సినిమాను.. రాజకీయాన్ని విడదీసి చూడటం కుదిరే పనికాదు. సౌత్ లో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే సినిమా నటులకు ఇక్కడ విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఆ ఆదరణే వాళ్లను రాజకీయాల వైపు నడిపించే నేతలుగా ఎదిగేలా చేసింది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదే సమయం ఉండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

ప్రస్తుత రాజకీయ పరిణామాలకు అనుగుణంగా టాలీవుడ్ లోనూ పొలిటికల్ జోనర్ లో సినిమాల హడావుడి మొదలైంది. అందునా జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నేతల బయోపిక్ లు మొదలెట్టారు. ఇప్పటికే బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత గాథతో బయోపిక్ మొదలెట్టారు. తేజ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదే టైంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితగాథతో ఆనందోబ్రహ్మ ఫేం డైరెక్టర్ మహి వి.రాఘవ ముమ్మట్టి హీరోగా యాత్ర సినిమా మొదలెట్టాడు. ఇవి రెండూ జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇవేకాక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్.. చంద్రబాబు జీవిత గాథలతో సినిమాలు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకుంటే ఈ ప్రాజెక్టులింకా పట్టాలెక్కలేదు. మరోవైపు బాలీవుడ్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. బాల్ థాకరేల బయోపిక్ లు రానున్నాయి. ముందుముందు ఇంకెన్ని బయోపిక్ లు మొదలవుతాయో చూడాలి.