Begin typing your search above and press return to search.

2017 క్రిస్మస్ కి బయోపిక్ రిలీజ్

By:  Tupaki Desk   |   26 Dec 2015 7:30 AM GMT
2017 క్రిస్మస్ కి బయోపిక్ రిలీజ్
X
సంజయ్ దత్ జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయో ప్రత్యక్షంగానే చూస్తున్నాం. మరి అలాంటి హీరోపై బయోపిక్ అంటే అది సాహసమే. అయినా దీన్ని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తానంటున్నాడు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ.

ఈయన దర్శకత్వ ప్రతిభకు బాలీవుడ్ ఒక్కటే కాదు.. టోటల్ ఇండియన్ మూవీ లవర్స్ ఫిదా అయిపోయారని చెప్పాలి. మొదటిసారిగా ఈయన డైరెక్షన్ వహించి తీసిన మూవీ మున్నాభాయ్ ఎంబీబీఎస్. టాలీవుడ్ - కోలీవుడ్ - శాండల్ వుడ్ లలోనూ రీమేక్ అయిన ఘనత దీనికి ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ 19 డిసెంబర్ 2003. ఈ రాజ్ కుమార్ హిరాణీ అమీర్ ఖాన్ తో తీసిన త్రీ ఈడియట్స్ - పీకే చిత్రాలు కూడా క్రిస్మస్ సందర్భంగానే రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు తీయబోతున్న సంజయ్ దత్ బయోపిక్ లో.. యంగ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చేయనుండడం విశేషం. సంజయ్ దత్ కి 17 ఏళ్ల వయసు నుంచి ఇప్పటివరకూ అన్ని అంశాలను టచ్ చేయనున్నారట. అక్రమంగా ఆయుధాల కలిగి ఉండడంతో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా చూపనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో స్టార్ట్ చేసి.. ఏడాదిన్నర పాటు షూటింగ్ జరుపుతామని చెప్పాడు డైరెక్టర్. అంటే.. ఆ మూవీని కూడా మరో క్రిస్మస్ కి అంటే.. 2017 క్రిస్మస్ నాటికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నాడు రాజ్ కుమార్ హిరాణీ.