Begin typing your search above and press return to search.

#సుశాంత్ మిస్ట‌రీ: రియా చ‌క్ర‌వ‌ర్తిపై బ‌యోపిక్.. డ్యాక్యుమెంట‌రీ.. పుస్త‌కం కూడా!!

By:  Tupaki Desk   |   28 Sept 2020 11:15 AM IST
#సుశాంత్ మిస్ట‌రీ: రియా చ‌క్ర‌వ‌ర్తిపై బ‌యోపిక్.. డ్యాక్యుమెంట‌రీ.. పుస్త‌కం కూడా!!
X
జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కన్నుమూసినప్పటి నుండి రియా చక్రవర్తి చిక్కుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ర‌ణానికి మాజీ ప్రేయ‌సి రియాకు సంబంధాల‌పై పోలీస్-సీబీఐ ఆరాల గురించి తెలిసిన‌దే. రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్ట్ నేప‌థ్యంలో ఆ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మే అయ్యింది. అందుకే ఇప్పుడు ఆమె బ‌యోపిక్ తీస్తే దాని రేంజే వేరుగా ఉంటుంద‌ని ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఇప్ప‌టికే అంతర్జాతీయ కవరేజీని పొందుతోంది. అందుకే కొంతమంది చిత్రనిర్మాతలు ఆమె జీవితంపై బయోపిక్ ను పరిశీలిస్తున్నారు. రియా చక్రవర్తిపై ఒక డాక్యుమెంటరీ కూడా పైప్ ‌లైన్ ‌లో ఉంద‌ని తెలుస్తోంది. అంతేకాదు రియాపై ఓ పుస్తకాన్ని రెడీ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రియా జీవితంలో ఆటుపోట్లపైనే కేంద్ర‌కంగా ఇవ‌న్నీ ఉంటాయ‌ని తెలుస్తోంది.

ర‌క‌ర‌కాల ఏజెన్సీల ద‌ర్యాప్తుల అనంత‌రం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ నెలలో రియాను అరెస్టు చేసింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించారు. రియా ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి బొంబాయి హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం సెప్టెంబర్ 29 న పోస్ట్ పోన్ అయ్యింది. ఆమె బెయిల్ పిటిషన్ లో.. రియా నిర్దోషి అని... ఆమె ఆమె కుటుంబంపై కఠినమైన ఆరోపణలు చేయడానికి ఎన్‌సిబి `ఉద్దేశపూర్వకంగా` ప్రయత్నిస్తోందని వాదిస్తోంది.తాను `మంత్రగత్తె-వేట` కు గుర‌య్యానంటూ తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది.

రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో ప్రేమ‌లో ఉంది. అత‌డు చనిపోయే కొద్ది రోజుల ముందు తన ఇంటిని విడిచిపెట్టిన‌ట్టుగా రియాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పాట్నాలో దాఖలు చేసిన ఫిర్యాదులో సుశాంత్ తండ్రి రియా పేరును కేసులో పెట్టారు. రియా ఆమె కుటుంబం సుశాంత్ ను మోసం చేసార‌ని అతని జీవితాన్ని అంతం చేయడానికి కుట్ర ప‌న్నార‌ని ఆరోపించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. ఈ విష‌యాల‌న్నిటినీ రియా బ‌యోపిక్ లో చూపిస్తారా? అన్న‌ది చూడాలి.