Begin typing your search above and press return to search.

కథల్లేక జీవిత కథలపై పడుతున్నారు

By:  Tupaki Desk   |   2 May 2017 12:30 AM GMT
కథల్లేక జీవిత కథలపై పడుతున్నారు
X
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్స్ సీజన్ పీక్స్ లో ఉంది. వరుసగా పీరియాడిక్ మూవీస్.. అందులోనూ పలువురు ప్రముఖుల నిజ జీవిత గాధలు వరుసగా సినిమాలుగా మలిచేస్తున్నారు. వీటి సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉండడంతో డిమాండ్ బాగా వీటికి భారీగా ఉంటోంది.

ప్రస్తుతం ఒకేసారి ముగ్గురి మహిళల జీవితాలను సినిమాలుగా మలిచేస్తున్నారు. బాడ్మింటన్  ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితాన్ని సినిమాగా చేస్తుండగా.. ఇందులో సైనా పాత్రను శ్రద్ధా కపూర్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయయి. ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా జీవితం కూడా సినిమాగా మారనుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా తెరకెక్కే ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. మరోవైపు మణికర్నిక పేరుతో ఝాన్సీ లక్ష్మీ బాయ్ చరిత్రను కంగనా హీరోయిన్ గా సినిమా చేస్తున్నారు.

నిజానికి విజయం కచ్చితంగా అందించే కథలు లేక.. ఏం కథలు వండాలో తెలియక.. ఇలా బయోపిక్స్ అంటూ వరుసగా సినిమాలు తీసేస్తున్నారు. ఇలా బయోపిక్స్ అయితే.. సెలబ్రిటీల జీవితంలో తెలియని కోణం జనాలకు చెప్పే అవకాశం ఉంటుందని చెబుతూ మార్కెట్ చేసుకోవడమే వీటి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే బాలీవుడ్ ఫిలిం 1మేకర్స్ ఇలా బయోపిక్స్ మీద పడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/