Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయ్‌ సర్‌ ప్రైజింగ్‌ లుక్‌

By:  Tupaki Desk   |   10 Aug 2015 5:50 AM GMT
తెలుగమ్మాయ్‌ సర్‌ ప్రైజింగ్‌ లుక్‌
X
తెలుగమ్మాయిలు తమిళ్‌ లో హవా సాగిస్తూ కెరీర్‌ లో దూసుకుపోతున్నారు. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితమే బిందుమాధవి కెరీర్‌ ప్రారంభించి తెలుగు, తమిళ్‌ లో లక్‌ చెక్‌ చేసుకుంది. తెలుగు వాళ్లు నిర్ధయగా తిరస్కరిస్తే, తంబీలు మాత్రం ఈ అమ్మడి ట్యాలెంటుకు హత్తుకుపోయారు. తమిళ పరిశ్రమలో బిందుమాధవి కి ఇంతకాలం తిరుగే లేదు. ఇప్పుడు కెరీర్‌ పీక్స్‌ లో ఉంది. ఇప్పటికిప్పుడు నాలుగు ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది.

ఇప్పటికే పెండింగులో ఉన్న సవాలీ సామాళీ ని త్వరలోనే రిలీజ్‌ కి సిద్ధం చేయనున్నారని సమాచారం. అలాగే పాండిరాజ్‌ దర్శకత్వంలో హైకూ చిత్రం పూర్తయింది. ఈ చిత్రం థియేటర్ల లోకి వచ్చేస్తుంది. అలాగే శిబిరాజ్‌ దర్శకత్వంలోని హారర్‌ చిత్రం జాక్సన్‌ దురై లో నటిస్తోంది. ఇది సెట్స్‌ లో ఉండగానే స్టార్‌ హీరో విక్రమ్‌ సరసన అరిమా నంబి ఫేం ఆనంద్‌ సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో ఓ సర్‌ ప్రైజింగ్‌ లుక్‌ తో షాకివ్వనుంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం.

ఈ చిత్రంలో కాజల్‌ ప్రధాన నాయికగా నటిస్తోంది. బిందుమాధవి షాకింగ్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనుంది. ఇంతవరకూ సాంప్రదాయ బద్ధంగా కనిపించినా ఈసారికి రూల్స్‌ పక్కన పెట్టేసి పూర్తి ఎక్స్‌ పోజింగ్‌ కి రెడీ అవుతోందిట. లుక్‌ వైజ్‌ సర్‌ ప్రైజ్‌ చేస్తుందని చెబుతున్నారు. తెలుగమ్మాయి కొత్త రూపం చూడాలంటే కాస్త వెయిట్‌ చేయాల్సిందే.