Begin typing your search above and press return to search.

బింబిసార బాక్సాఫీస్ బ్లాస్ట్.. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్!

By:  Tupaki Desk   |   6 Aug 2022 5:59 AM GMT
బింబిసార బాక్సాఫీస్ బ్లాస్ట్.. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్!
X
నందమూరి వారసుల్లో బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ బ్రాండ్ ను మరో లెవల్ కు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటినుంచో ఎన్టీఆర్ తో పాటే తన మార్కెట్ కూడా పెంచుకోవాలి అని కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు. మొదట్లో ప్రేమకథలు చేసి ఆ తర్వాత మాస్ కమర్షియల్ సినిమాలు చేశాడు. అయినప్పటికీ కూడా అతనికి ఒక స్టాండర్డ్ గా వరుస విజయాలు అయితే రాలేకపోయాయి.

ప్రయోగాలు సొంత బ్యానర్ లోనే బాగానే చేసినప్పటికీ కూడా ఏవి వర్కౌట్ కాలేదు. ఇక చాలాకాలం తర్వాత అతను మొదటి సారి ఒక ఫాంటసీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఫాంటసీ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన బింబిసార సినిమా మొదటిరోజు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

ఇంతకుముందు అయితే బెస్ట్ ఓపెనింగ్ మూవీ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమా మూడు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక తర్వాత వచ్చిన MLA మూవీ 2.70 కోట్లు, సంక్రాంతి ఫెస్టివల్ లో వచ్చిన ఎంత మంచి వాడవురా సినిమా రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత ఎంతో ప్రయోగాత్మకంగా వచ్చిన 118 మూవీ 1.60 కోట్ల షేర్ వసూళ్ళను సాధించింది ఇక నా నువ్వే సినిమా ఫస్ట్ డే అత్యంత దారుణంగా 0.75 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు ఎంతో నమ్మకంతో చేసిన బింబిసారా సినిమా 6.30 కోట్ల షేక్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కళ్యాణ్ రామ్ కెరీర్ మొత్తంలో కూడా ఇంతటి భారీ ఓపెనింగ్స్ ఎప్పుడు అందుకోలేదు అనే చెప్పాలి.

ఏదేమైనా కూడా ఈ సినిమా అతనికి మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పవచ్చు. కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా వశిష్ట ఫాంటసీ పాయింట్ తో యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి ఒక సరి కొత్త ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు.

ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ కూడా బెస్ట్ ఓపెనింగ్ అందుకోవాడనికి ఉపయోగపడ్డాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా వీకెండ్ లో ఇదే తరహాలో కలెక్షన్స్ అందుకుంటే మాత్రం సోమవారం నాటికి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా కళ్యాణ్ రామ్ ఎంతవరకు ప్రాఫిట్ అందుకుంటాడో చూడాలి.