Begin typing your search above and press return to search.

చూపు తిప్పనివ్వని బికినీ జూ. అతిలోక సుందరి

By:  Tupaki Desk   |   31 Jan 2022 5:34 AM GMT
చూపు తిప్పనివ్వని బికినీ జూ. అతిలోక సుందరి
X
అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఇంకా ఎంతో అభిమానం చూపించే వారు ఎంతో మంది ఉంటారు. భాష తో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులు.. భక్తులు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఆమె వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్‌ తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

తల్లి మృతికి ముందే జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా.. మొదటి సినిమా సెట్స్ పై ఉన్న సమయంలోనే శ్రీదేవి మృతి చెందిన విషయం తెల్సిందే. శ్రీదేవి మృతి చెందినప్పటి నుండి తన కెరీర్‌ ను తాను బిల్డ్ చేసుకుంటూ కెరీర్‌ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ జాన్వీ కపూర్‌ ముందుకు సాగుతుంది. హీరోయిన్ గా మొదటి సినిమా తో నటుడిగా మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడు కమర్షియల్‌ గా మాత్రం ఇప్పటికి బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. కమర్షియల్‌ గా సక్సెస్ లేక పోయినా కూడా సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు ఫుల్‌ పాపులారిటీని దక్కించుకుంది.

స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ నెట్టింట రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంది. పద్దతైన చీర కట్టుతో మొదలుకుని స్కిన్ షో చేసే స్కర్ట్స్ వరకు అన్ని రకాల కాస్ట్యూమ్స్‌ తో ఈ అమ్మడు తన అందాన్ని ప్రదర్శిస్తూ పాపులారిటీని దక్కించుకుంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు బికినీలో కనువిందు చేసింది. తడిసిన అందాలతో అలా పూల పూల బికినీతో ఆకట్టుకుంది. జాన్వీ కపూర్‌ మొన్న మొన్నటి వరకు చిన్న అమ్మాయిగానే అనిపించినా ఇప్పుడు తనను చూస్తుంటే ఒక మెచ్యూరిటీ సాధించిన హీరోయిన్ ను చూసినట్లుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్‌ కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పడితే భవిష్యత్తులో మంచి హీరోయిన్ గానే కాకుండా స్టార్‌ హీరోయిన్ గా కూడా నిలుస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మూడు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో ఒకటి నయనతార నటించిన కో కోకిల రీమేక్ కూడా ఒకటి.

ఇక టాలీవుడ్‌ లో ఈ అమ్మడు ఒక స్టార్‌ హీరోతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా గత కొన్ని వారాలుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది లో సౌత్‌ ప్రేక్షకుల ముందుకు జాన్వీ కపూర్ రావడం పక్కా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ధీమాగా ఉన్నారు. తమిళంలో కూడా ఈ అమ్మడు నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. హిందీ సినిమా లు చేస్తూ తెలుగు మరియు తమిళ సినిమాలు చేస్తానంటున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అక్కడ ఇక్కడ కలిపి తన అందాల వింధుతో ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉంది.