Begin typing your search above and press return to search.
#పుష్ప మూవీలో ఆ రెండు సీన్లు గగుర్పాటే
By: Tupaki Desk | 6 Dec 2021 12:03 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప- ది రైజింగ్` డిసెంబర్ 17న థియేటర్లలోకి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప మాస్ ట్రీట్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల విడుదలైన అఖండ వసూళ్ల పరంగా పరిశ్రమకు గొప్ప ఊపునిచ్చిన క్రమంలో పుష్ప విజయంపైనా ధీమా పెరిగింది. జనాల్ని థియేటర్లలోకి పుల్ చేసేందుకు ఇది ఒక అవకాశం అని బన్ని - సుకుమార్ టీమ్ భావిస్తోంది.
అయితే `పుష్ప` లాంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాకి ఆరంభ వసూళ్ల కోసం థియేటర్లను అంతే భారీగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక సాగుతోంది. అలాగే థియేటర్లలో ఆడియెన్ ని నిరాశపరచకుండా ప్రతి సన్నివేశం దేనికదే యూనిక్ గా తీర్చిదిద్దేందుకు సుకుమార్ చాలా తపించారని తెలిసింది. ముఖ్యంగా ఓ రెండు సన్నివేశాలు వెండితెరపై అద్భుతంగా పండబోతున్నాయని గుసగుస వినిపిస్తోంది.
ఇప్పటికే టీజర్ లో ఆవిష్కరించిన బైక్ ఫైట్ సినిమాకే హైలైట్ గా సాగనుందని సమాచారం. గూండాలు వెంబడిస్తున్నప్పుడు నల్లమల అడవిలోని దట్టమైన భూభాగాల్లో అల్లు అర్జున్ బైక్ నడుపుతూ సాగించే భారీ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు పెద్ద హైలైట్ కాబోతోంది. ఈ సీక్వెన్స్ మొత్తం అభిమానులకు ప్రేక్షకులకు సీట్ అంచుపై జారేంతగా థ్రిల్ కి గురి చేస్తుందట.
అలాగే బన్నీని పట్టుకునేందుకు పోలీసులు వెంటాడే సీన్ మరో హైలైట్. అడవిలో దాగి ఉన్న ఎర్రచందనం గురించి వివరాలు ఇవ్వడానికి తీవ్రంగా హింసించే సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుందట. ఈ సీన్ బన్నీలోని మెగా పెర్ఫామర్ ని బయటికి తీస్తుందట.
ఈ రెండు సీన్లు చాలా గ్రిప్పింగ్ గా వచ్చాయని తెలిసింది. అలాగే శ్రీవల్లితో పుష్పరాజ్ రొమాన్స్.. అనసూయ బ్లేడ్ సన్నివేశం కూడా ఆద్యంతం రక్తి కట్టిస్తాయని తెలుస్తోంది. పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.