Begin typing your search above and press return to search.

ప్రముఖ విలన్ సోదరుడి ఆత్మహత్య.. షాకింగ్ కారణం

By:  Tupaki Desk   |   9 March 2020 12:03 PM IST
ప్రముఖ విలన్ సోదరుడి ఆత్మహత్య.. షాకింగ్ కారణం
X
తమిళనాట క్రేజీ విలన్ గా ఆనంద్ రాజ్ కు పేరుంది. రజినీకాంత్ నటించిన ‘భాష’ సినిమాలో ఇతడు రౌడీగా మంచి పేరు సంపాదించాడు. తెలుగు, తమిళం దక్షిణాదిన విలన్ గా చాలా చిత్రాల్లో నటించాడు. తాజాగా ఈయన సోదరుడు కనగసబాయ్ పాండిచ్చేరి లో ఆత్మహత్య చేసుకోవడం తమిళ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.

ఈ విషాద ఘటనతో ఆనంద్ రాజ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. విలన్ ఆనంద్ రాజ్ సోదరుడు కనగసబాయ్ పాండిచ్చేరి సహా తమిళనాడులో చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుంటారు. ఈ చిట్ ఫండ్స్ల్ లో తీవ్రనష్టాలే తమ కొంప ముంచాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే సోదరుడి మరణంపై పుకార్లు లేవడంతో తాజాగా విలన్ ఆనంద్ రాజ్ స్పందించాడు. నా సోదరుడి మరణానికి బెదిరింపులే కారణమని.. అతడిని చంపుతామని బెదిరించారని విలన్ ఆనంద్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి మానసిక క్షోభకు గురైన తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆనంద్ రాజ్ తెలిపారు.

కనగసబాయ్ వ్యాపారంలో నష్టాలకు తోడు ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. దీనిపై అతడిపై దాడి చేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తనను ఏమైనా చేస్తారేమోననే కనగసబాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరనున్నట్టు ఆనంద్ రాజ్ తెలిపారు.