Begin typing your search above and press return to search.

వచ్చే జనవరిలో ప్రభాస్-పవన్ కళ్యాణ్ తలపడనున్నారా..?

By:  Tupaki Desk   |   19 March 2020 1:20 PM IST
వచ్చే జనవరిలో ప్రభాస్-పవన్ కళ్యాణ్ తలపడనున్నారా..?
X
ఇండియన్ సినీ చరిత్రలో మరో రెండు పాన్ ఇండియా సినిమాలు త్వరలోనే తలపడే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో చిన్న హీరోల నుండి టాప్ హీరోల వరకు సినిమా షూటింగులను వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా షూటింగ్స్ ఆలస్యమై సినిమాల విడుదల తేదీలు కూడా మారుతున్నాయి. ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సినవి వచ్చే నెలకి, వచ్చే నెలలోవి ఆ తర్వాత దసరా, దీపావళికి వాయిదా వేస్తున్నారు.

తెలుగులో కూడా పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇటీవలే చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ 20వ సినిమా కరోనా ఎఫెక్ట్ వలన వాయిదా పడుతున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు. అందుకే నవంబర్ లో విడుదల కానున్నట్లు ఇంతకు ముందు ప్రకటించారు కానీ అది వాయిదా పడేలా ఉందని భావిస్తున్నారు. అదే గనక జరిగితే ప్రభాస్ 20వ సినిమా వచ్చే ఏడాది జనవరిలో అవుతుందేమోనని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించనున్న 27వ సినిమా కూడా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. పీరియాడిక్ సినిమాగా రూపొందింస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడట. పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే 2021 జనవరిలో విడుదల కానుండటం తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పవర్ స్టార్ పాన్ ఇండియన్ సినిమా తలపడనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రెండు పాన్ ఇండియన్ తెలుగు హీరోల సినీ సమరం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తి కలిగిచే విషయం. ప్రభాస్-పవన్ కళ్యాణ్ ల అభిమానులు కూడా ఈ రెండు సినిమాల కోసం కుతూహలంగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.