Begin typing your search above and press return to search.

24/7 బిగ్ బాస్ నే చూడ‌మంటే ఎలా స‌ర్?

By:  Tupaki Desk   |   15 Feb 2022 10:00 PM IST
24/7 బిగ్ బాస్ నే చూడ‌మంటే ఎలా స‌ర్?
X
బిగ్ బాస్ - తెలుగు నాలుగు సీజ‌న్లు ర‌క్తి క‌ట్టించాయి. కింగ్ నాగార్జున హోస్టింగ్ లో మూడు సీజ‌న్లు బుల్లితెర‌పై అల‌రించాయి. ఇప్పుడు ఐదో సీజ‌న్ ని ఓటీటీలో ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. బిగ్ బాస్ OTT ఈ నెల 26న ప్రారంభమవుతుంది. దాని గురించి ఇప్పటికే చాలా ప్ర‌చారం సాగుతోంది. ఈరోజు మేకర్స్ ప్రోమోను విడుదల చేసారు. ఇది చాలా సరదాగా ఫ‌న్నీగా ఆక‌ట్టుకుంది.

ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఖైదీగా వెన్నెల కిషోర్ బోలెడంత ఫ‌న్ ని ప్రోమోలో ప్ర‌ద‌ర్శించారు. అతని చివరి కోరిక గురించి అడిగినప్పుడు.. చనిపోయే ముందు బిగ్ బాస్ ఒక ఎపిసోడ్ చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ అతను రోజంతా చూస్తూనే ఉన్నాడు. నాగార్జున అత‌డికి లాయ‌ర్ గా క‌నిపిస్తున్నారు. మురళీ శర్మ ఈ చోద్యం చూడ‌లేక‌ ఆవేద‌న చెందే పోలీస్ గా క‌నిపిస్తున్నారు.

బిగ్ బాస్ OTTలో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ రౌండ్ ది క్లాక్ ఉంటుందని ప్రోమోలో కింగ్ వెల్ల‌డించారు. అంటే 24/7 ఓటీటీల‌కే అతుక్కుని ఉండాల‌ని చెప్ప‌కనే చెప్పారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉండ‌డంతో వైర‌ల్ గా మారుతోంది. మరి షో ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్ప‌టికే హిందీలో ఓటీటీ షో పెద్ద స‌క్సెసైంది.

https://twitter.com/DisneyPlusHSTel/status/1493569312556138497?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1493569312556138497|twgr^|twcon^s1_&ref_url=https://www.123telugu.com/mnews/bigg-boss-ott-promo-looks-good.html