Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనా?

By:  Tupaki Desk   |   11 Sep 2021 10:30 AM GMT
#BIGGBOSS5TELUGU : ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనా?
X
బిగ్ బాస్ సీన్‌ 5 ఎప్పుడెప్పుడా అంటూ కొన్ని నెలలుగా ఎదురు చూడటం జరిగింది. ఎట్టకేలకు సీజన్ ప్రారంభం అయ్యింది. సీజన్ ప్రారంభం అవ్వడం అయ్యింది.. మొదటి వారం ఎలిమినేషన్ కు కూడా కాబోతున్నారు. నిన్న రాత్రి వరకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఎలిమినేషన్‌ కు నామినేట్ అయిన వారిలో యాంకర్ రవి.. జెస్సీ.. మానస్‌.. కాజల్ మరియు హమీదాలకు పడాల్సిన ఓట్లు పడ్డాయి. అయితే ఎవరికి ఎక్కువ పడ్డాయి ఎవరికి తక్కువ పడ్డాయి అనే విషయంలో సస్పెన్స్‌ గా ఉంది. జెస్సీ విషయంలో కొందరు మొదట్లో విమర్శలు చేశారు. అతడు మెచ్యూరిటీతో ఆడటం లేదని.. ముఖ్యంగా యానీ మాస్టర్ తో అతడి గొడవ వల్ల అతడికి పెద్ద మైనస్ అయ్యిందని కామెంట్స్ వచ్చాయి. జెస్సీకి ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు అంటూ మొదటి రెండు రోజులు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. కాని ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే టైమ్‌ కు మాత్రం కాజల్‌ కు తక్కువ ఓట్లు వచ్చాయి అనేది స్టార్‌ మా వర్గాల ద్వారా అందుతున్న అనఫిషియల్‌ సమాచారం.

ఆర్‌ జే కాజల్ విషయంలో ప్రేక్షకులు మొదట్లో చాలా పాజిటివ్ గా ఉన్నారు. కాని ఆమె అతి వల్ల ఆమెను జనాలు పక్కన పెట్టారు. ఆమె ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకునేందుకు ప్రయత్నించడం.. అవతలి వారితో గొడవలు ఎందుకు అనుకోకుండా మాట్లాడి పరిష్కరించుకోవాలని ప్రయత్నించడం.. ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉండాలనుకోవడం ఆమె చేసిన తప్పు అంటున్నారు. తనకు కిచెన్‌ లో అడుగు పెట్టాలంటే ఇష్టం ఉండదు అని.. నేను నా పని చేసుకుంటూ వెళ్తాను అంటూ కెప్టెన్‌ చెప్పినా కూడా వినకుండా తనంతట తాను నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్ జే కాజల్‌ పై ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉంది. అందుకే ఆమెకు ఓట్లు వేయలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అత్యధికంగా రవికి ఓట్లు పడ్డాయని స్టార్‌ మా వర్గాల వారు చెబుతున్నారు. ఆ తర్వాత మానస్‌ ఇంకా హమీదాలకు వచ్చాయట. కాజల్ మరియు జెస్సీల మద్య తక్కువ తేడా ఉందని.. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు దక్కించుకున్నా చివరికి మాత్రం ఆర్ జే కాజల్‌ కు ఓట్లు తక్కువ పడ్డయి అంటూ సమాచారం అందుతోంది. ఈ విషయమై మరి కొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం నుంది. నేటి ఎపిసోడ్ కోసం చిత్రీకరణ ముగించారు. రేపటి ఎపిసోడ్ కోసం నేడే మద్యాహ్నం తర్వాత షూటింగ్‌ ఉంటుంది. అంటే సాయంత్రం వరకు ఎవరు ఎలిమినేట్‌ అయ్యింది లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం కాజల్‌ ఎలిమినేట్‌ అవ్వబోతుందా లేదంట జెస్సీకి ఉద్వాసన పలుకనున్నారు.. వీరిద్దరు కాకుండా మరెవ్వరైనా బయటకు వచ్చేస్తారా అనేది చూడాలి.