Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU ః హాటీ ప్రియ వైల్డ్‌ ఎంట్రీ నిజం ఎంత ?

By:  Tupaki Desk   |   30 Sep 2021 4:26 AM GMT
#BIGGBOSS5TELUGU ః హాటీ ప్రియ వైల్డ్‌ ఎంట్రీ నిజం ఎంత ?
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 నాల్గవ వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు కూడా వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ లేక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ సీజన్‌ లో వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కంటెస్టెంట్స్ సంఖ్య విషయంలో ముందుగానే సరి చూశారు. అన్ని వారాలకు సరిపోయేంత మందిని ఇంట్లోకి పంపించడం జరిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటిలోకి పంపించాలంటే చాలా తతంగా జరగాల్సి ఉంటుంది. అందుకే ఈ సీజన్ కు వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ లేనట్లే అంటూ కొందరు భావిస్తున్నారు. ఈ సమయంలో సోషల్‌ మీడియాలో వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ గురించి ఆసక్తికర వార్తలు వచ్చాయి. హాట్ బ్యూటీ యాంకర్ విష్ణు ప్రియ బిగ్ బాస్ లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎంత వరకు నిజం అంటూ ఆమెను చాలా మంది చాలా రకాలుగా సోషల్‌ మీడియా ద్వారా అడిగారు. ఆమె మాత్రం ఆ వార్తలకు స్పందించడం లేదు.. కాని అసలు విషయం ఏంటీ అంటే ఆమె బిగ్ బాస్ కు వెళ్లడం లేదట.

గతంలో బిగ్ బాస్ గురించి ఆమెను అడిగిన సమయంలో నాకు బిగ్‌ బాస్ కాన్సెప్ట్‌ నచ్చదు అనేసింది. నేను బిగ్‌ బాస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు అంటూ గత సీజన్ ల సమయంలో క్లారిటీ ఇచ్చింది. కనుక ఈసారి ఆమె ప్రత్యేకంగా మళ్లీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లో విష్ణు ప్రియ ఎంట్రీ ఉంటుందనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అంటూ మా వర్గాల వారు కూడా అంటున్నారు. అయిదవ వారంలో వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఉంటుందని గతంలో మా వర్గాల వారు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కాని పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉన్నట్లుగా అనిపించడం లేదు. అసలు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీకి కావాల్సిన ఏర్పాట్లు షురూ అయినట్లుగా కనిపించడం లేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు చెబుతున్నారు.

విష్ణు ప్రియ సోషల్‌ మీడియాలో తన అందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఒక వేళ ఆమె కనుక వెళ్లాలి అనుకుంటే శ్రీముఖి లేదా మరెవ్వరైనా ఆమెను ఈజీగా అక్కడకు పంపించేస్తారు. కాని ఆమెకు ఆ ఆసక్తి లేదు. ఒక వేళ విష్ణు ప్రియా కనుక వెళ్తే ఖచ్చితంగా హాట్ బ్యూటీకి మద్దతు చాలానే ఉంటుంది. శ్రీముఖి నుండి మొదలుకుని చాలా మంది చాలా రకాలుగా మద్దతు తెలుపుతూ ఉంటారు. ఆమెకు జనాల మద్దతు కూడా ఉంటుంది. కనుక వెళ్తే అంతా మంచే జరుగుతుంది అనేది కొందరి అభిప్రాయం. ఆమె ఎంటర్ టైన్ మెంట్‌ మామూలుగా ఉండదు. అందుకే ఆమెను అభిమానులు కోరుకుంటున్నారు. కాని వాస్తవానికి ఆమె కు బిగ్‌ బాస్ అంటే ఆసక్తి లేదు. కనుక ముందు ముందు సీజన్ ల్లో కూడా ఆమె కనిపిస్తుందనే నమ్మకం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.