Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : పోస్టర్ లు వేసినా ఫలితం లేదు

By:  Tupaki Desk   |   4 Oct 2021 4:32 AM GMT
#BIGGBOSS5TELUGU : పోస్టర్ లు వేసినా ఫలితం లేదు
X
ఏ ప్రాడక్ట్‌ కు అయినా పబ్లిసిటీ చాలా ముఖ్యం. ప్రతి వస్తువు జనాల్లోకి వెళ్లాలి అంటే ప్రమోషన్ తప్పనిసరి. అది సినిమా అయినా సరే మరేదైనా సరే. జనాల్లోకి వెళ్లిన తర్వాత జనాలు ఒకసారి దాన్ని కొనుగోలు చేస్తారు.. కాని క్వాలిటీ బాగాలేకుంటే ఎంత పబ్లిసిటీ చేసినా కూడా దాన్ని కొనుగోలు చేయించడం కష్టం. అలాగే సినిమాను భారీ ఎత్తున పబ్లిసిటీ చేయించి జనాల్లోకి తీసుకు వెళ్తారు. సినిమాకు పాజిటివ్‌ టాక్ వస్తే పర్వాలేదు. కాని నెగటివ్‌ టాక్ వస్తే మాత్రం కేవలం ఒకటి రెండు రోజుల్లోనే క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పబ్లిసిటీ అనేది కేవలం మార్కెట్‌ లోకి ఎంటర్ అయ్యే వరకే. ఆ తర్వాత ఖచ్చితంగా కష్టపడి దాన్ని క్వాలిటీ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఫార్ములా బిగ్‌ బాస్ కంటెస్టెంట్స్ కు కూడా వర్తిస్తుంది.

బిగ్ బాస్‌ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం బయట వారి పీఆర్ టీమ్‌ భారీ స్థాయిలో పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. వారికి వచ్చే పారితోషికం కంటే కూడా అధికంగా ఖర్చు చేసి పబ్లిటీ చేయిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. గత వారం ఎలిమినేట్ అయిన లహరి కోసం ఎంతో మంది తో బైట్ ఇప్పించారు.. సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడం జరిగింది. ఎంత చేసినా కూడా ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. పబ్లిసిటీ చేసినంత మాత్రాన జనాల్లో ఆసక్తి కలుగదు. వారు హౌస్ లో ఎలా ఉన్నారు.. వారి ప్రవర్తన ఏంటీ అనేది ప్రేక్షకులు చూస్తారు. అలా చూసిన ప్రేక్షకులు తమకు ఇష్టం అయిన వారిని ఓట్లు వేస్తారు. అంతే కాని పబ్లిసిటీని చూసి ఓట్లు వేయరు అనేది మరోసారి నిరూపితం అయ్యింది. నటరాజ్ మాస్టర్ కోసం ఆయన టీమ్‌ చాలా ప్రమోషన్స్ చేసింది. ఆయన శిష్యులు స్వచ్చందంగా వచ్చి మరీ ప్రచారం చేయడం జరిగింది. నటరాజ్ మాస్టర్ కోసం ఏకంగా పోస్టర్‌ లను కూడా వేసి పబ్లిసిటీ చేయడం జరిగింది.

నటరాజ్ మాస్టర్ కోసం ఓట్లు వేయండి అంటూ వాల్‌ పోస్టర్ లు వేశారు. ఇలా ఓట్ల కోసం వాల్‌ పోస్టర్‌ లు వేయడం మొదటి సారి. ఈ ప్రయోగం కొత్తగా అనిపించినా జనాలు మాత్రం పట్టించుకోలేదు. ప్రముఖ పట్టణాల్లో ఈ పోస్టర్ లు కనిపించాయి. పెద్ద ఎత్తున నటరాజ్ మాస్టర్ శిష్యులు మరియు సోషల్‌ మీడియా టీమ్‌ ప్రచారం మొదలు పెట్టారు. కాని ఏ ఒక్కటి కూడా వర్కౌట్‌ కాలేదు. ఆయన గుంట నక్క వ్యాఖ్యలు.. పులి మేక వ్యాఖ్యలు ఇలా అన్ని వ్యాఖ్యలను ప్రేక్షకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అందుకే బిగ్‌ బాస్ నుండి ఆయన్ను బయటకు పంపించేలాయనే నిర్ణయానికి వచ్చారు. అందుకే ఆయన్ను మెల్లగా సాగనంపారు. బిగ్‌ బాస్‌ హౌస్ లో ఉండే అర్హత ఆయనకు లేదు అంటూ అంతా తేల్చి పారేశారు.

మరి కొందరు మాత్రం ఆయన భార్యకు ఆయన అవసరం ఉంది కనుక తాము ఓట్లు వేయలేదు అంటున్నారు. కారణం ఏదైనా నటరాజ్‌ అప్పుడప్పుడు వింత ప్రవర్తన మరియు కంటెస్టెంట్స్ ను జంతువులతో పోల్చడం వంటి కారణాల వల్ల బిగ్‌ బాస్ సీజన్ 5 నుండి నాల్గవ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఆయన ఎలిమినేట్‌ అయిన సమయంలో ఇంటి సభ్యులు పలువురు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి వరకు ఏ హౌస్‌ మెంట్‌ వెళ్లినా కూడా ఈ స్థాయిలో ఎమోషనల్‌ అవ్వలేదు. పలువురు కన్నీటి పర్యంతం అయ్యారు. లోబో షాక్ లో అలాగే ఉండి పోయాడు.