Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : పాత వీడియోతో లోబోను ఆడుకుంటున్నారు

By:  Tupaki Desk   |   8 Sep 2021 1:30 AM GMT
#BIGGBOSS5TELUGU : పాత వీడియోతో లోబోను ఆడుకుంటున్నారు
X
బిగ్ బాస్‌ మొదలైంది అంటే కొందరు ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో ట్రోల్స్ మొదలు పెడతారు. ట్విట్టర్ మరియు ఇన్‌ స్టాగ్రామ్‌ లో కంటెస్టెంట్స్ కు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా కొందరు ఎవరికి తోచిన మీమ్స్‌ వారు షేర్‌ చేస్తూ ఉంటారు. కంటెస్టెంట్స్ పాత వీడియోలు ఫొటోలు ఎక్కడెక్కడివో వెదికి పట్టుకుని ఇప్పుడు ట్రెండ్‌ చేసేందుకు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కో కంటెస్టెంట్‌ కు వందల కొద్ది ఫ్యాన్ పేజీలు అని.. కొందరు మీమ్స్ పేజీలని మొదలు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. బిగ్‌ బాస్ లో అడుగు పెట్టబోతున్నాడు అంటూ చాలా రోజులుగా లోగో గురించి ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే.. ప్రచారం జరిగినట్లుగానే లోబో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు. ఫుల్‌ చిల్‌ పర్సన్ అయిన లోబో విభిన్నమైన లుక్ తో ఎంటర్‌ టైన్ చేయడం ఖాయం అంటున్నారు.

నామినేషన్‌ చేసిన సమయంలో కూడా నవ్విస్తూనే నామినేట్‌ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక ప్రత్యేకమైన కంటెస్టెంట్‌ గా లోబో నిలిచాడు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ కు ఎక్కడో ఒక లూప్‌ హోల్‌ లేదా మరేదో వెదికి పట్టుకుని నెటిజన్స్ ట్రోల్‌ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో లోబో వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. కొన్నాళ్ల క్రితం లోబో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్‌ బాస్ అనేది తనకు ఇంట్రెస్ట్‌ లేదని.. అది నా టేస్ట్‌ కాదు.. నాకు ఆఫర్‌ రాకపోవడమే మంచిది అనుకుంటాను అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను మీమర్స్ తమదైన శైలిలో వాడేస్తున్నారు. ఆ వీడియోను రచ్చ రచ్చ చేస్తున్నారు.

గతంలో తన టేస్టు కాదన్న లోబో ఇప్పుడు ఎలా బిగ్‌ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్‌ అయ్యాడు అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. కొందరు మాత్రం అప్పుడు ఆఫర్‌ రాలేదు కనుక రాకపోవడం మంచిది అయ్యింది అనుకున్నావు.. ఇప్పుడు వచ్చింది కనుక వచ్చిందే మంచిది అయ్యిందని హౌస్‌ లోకి అడుగు పెట్టావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లోబో ఆ పాత వీడియోతో కొత్తగా నెటిజన్స్‌.. మీమర్స్ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. లోబో ఎంటర్‌ టైన్మెంట్‌ బాగానే ఇస్తున్న కారణంగా ఆయన కొన్నాళ్ల పాటు బిగ్‌ బాస్ లో కొనసాగడం ఖాయం. ఆయన్న నామినేట్‌ చేసే వారు కూడా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆయన అందరితో చిల్‌ గా ఉంటాడు. ముందు ముందు ఏం జరుగుతుందో కాని ఇప్పటికి మాత్రం బిగ్‌ బాస్‌ లో లోబో ఒక పాజిటివ్‌ వైబ్స్ తో ఉన్నాడు. సోషల్‌ మీడియాలో ఆయనపై నెగటివ్‌ మీమ్స్ మాత్రమే కాకుండా పాజిటివ్‌ మీమ్స్ కూడా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా లోబోకు ఓట్లు బాగానే పడుతాయి అనేది బుల్లి తెర వర్గాలు మరియు ప్రేక్షకుల అభిప్రాయం.