Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU లీక్‌ : సన్నీ ఇష్యూతో ప్రియా ఎలిమినేట్‌

By:  Tupaki Desk   |   24 Oct 2021 3:47 AM GMT
#BIGGBOSS5TELUGU లీక్‌ : సన్నీ ఇష్యూతో ప్రియా ఎలిమినేట్‌
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 నుండి ఈ వారం ఎలిమినేట్‌ అవ్వబోతున్నది ఎవరు అనేది తేలిపోయింది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఒక రోజు ముందుగానే ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. బిగ్‌ బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ప్రియా. ఈమె స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ గానే పేరు దక్కించుకున్నారు. టాస్క్ ల పరంగా ఆమె ఎక్కువగా స్ట్రాంగ్‌ కాకపోయినా కూడా ఆమెకు ఉన్న గుర్తింపు మరియు హౌస్‌ లో ఆమె ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె అనూహ్యంగా బయటకు రావడంకు కారణం ఆమె ప్రవర్తనే. ఆమె సన్నీ పట్ల వ్యవహరించిన తీరు మరీ చీప్ గా ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఆమె ఈ వారం బయటకు వచ్చేసింది.

బిగ్‌ బాస్ ప్రేక్షకుల ఆలోచన వారం వారం మారుతూనే ఉంటుంది. గత వారంలో ఒకరు వీక్‌ కంటెస్టెంట్‌ అనిపిస్తే తదుపరి వారం వారే ఎలిమినేట్ అవ్వచ్చు.. లేదంటే మరెవ్వరైనా ఎలిమినేట్‌ అవ్వచ్చు. బిగ్‌ బాస్ లో ప్రియా కంటే వీక్ కంటెస్టెంట్స్ చాలా మందే ఉన్నారు. కాని సన్నీతో గొడవ మరియు దాన్ని ఆమె సాగతీసిన విధానం.. ఆమె కన్నీంగ్ మెంటాల్టీ ఇలా అన్నీ కూడా ఆమెకు నెగటివ్‌ అయ్యాయి. సన్నీతో ఆమె ప్యాచప్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా అప్పటికే ఆలస్యం అయ్యింది. ఆమె నుండి ఇలాంటిది ఎక్స్‌ పెక్ట్ చేయలేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ వారంలో ప్రియా కనుక సన్నీతో సున్నం పెట్టుకోకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఎలిమినేషన్‌ వేరే వారు అయ్యే వారు.

ఆదివారం ఎపిసోడ్‌ లో ఆమె ఎలిమినేషన్‌ ను నాగార్జున ప్రకటించబోతున్నారు. ఆమె బయటకు వచ్చి ఏం మాట్లాడింది.. నాగార్జున ఆమె విషయంలో ఎలా రియాక్ట్‌ అయ్యాడు అనేది చర్చనీయాంశంగా మారింది. మరో వైపు సన్నీ విషయంలో ప్రియా చేసిన పనిని సీరియస్ గా ఖండించకుండా ఫన్నీగానే ఆమెతో మాట్లాడటం పై నాగార్జున ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ప్రియా ఎలాగూ వెళ్తుంది కనుక ఎందుకు ఆమెను మరీ కౌంటర్‌ ఇచ్చి పంపించడం అనుకుని బిగ్‌ బాస్ టీమ్‌ ఇలా ప్లాన్‌ చేసి ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ప్రియా ఎలిమినేట్‌ అవ్వబోతున్న నేపథ్యంలో సన్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సన్నీ కెప్టెన్‌ గా అయిన తర్వాత ఆమె ఎలిమినేట్ అవ్వడం సన్నీ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.