Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E3 : చిన్న చిన్న గొడవలు రచ్చ రచ్చ

By:  Tupaki Desk   |   8 Sep 2021 3:28 AM GMT
#BIGGBOSS5TELUGU E3 : చిన్న చిన్న గొడవలు రచ్చ రచ్చ
X
బిగ్‌ బాస్ తెలుగు సీజన్‌ 5 ఎపిసోడ్‌ 3 చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రోమోల్లో లోబో మరియు సిరి ఇంకా అనీ మాస్టర్ ఇంకా జెస్సీలు గొడవ పడ్డట్లుగా చూపించారు. ఈరోజు ఎపిసోడ్‌ రచ్చ రచ్చగా ఉండేలా ఉంది అంటూ ముందుగానే ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్లుగానే గొడవలు మొదలు అయ్యాయి. పవర్ రూమ్‌ కు సంబంధించిన టాస్క్‌ మొదలు అయ్యింది. అదే సమయంలో కెప్టెన్సీ టాస్క్‌ కూడా షురూ అయినట్లుగా బిగ్‌ బాస్ ప్రకటించాడు. పవర్‌ రూమ్‌ లోకి మొదట విశ్వ వెళ్లగా అక్కడ బిగ్‌ బాస్ ఇద్దరి డ్రస్‌ లను పూర్తిగా స్టోర్‌ రూమ్‌ లో పెట్టాల్సి ఉంటుంది అంటూ సూచించగా యాంకర్ రవి మరియు ప్రియ ల డ్రస్ లను ఇంకా వారి వస్తువులను తీసుకోవచ్చు అంటూ విశ్వ చెప్పాడు. దాంతో ఆ ఇద్దరి వస్తువులు తొలగించడం జరిగింది. దాంతో రవి అమ్మాయి డ్రస్‌ వేసుకోగా కొద్ది సమయం ఫన్‌ క్రియేట్‌ అయ్యింది. ఆ తర్వాత మానస్ కు పవర్ రూమ్‌ లోకి వెళ్లే అవకాశం దక్కింది. మానస్ కు ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకోమని వారు ఇంటి సభ్యులు అంతా కూడా పడుకున్న తర్వాత పడుకోవాలంటూ సూచించాడు. అందుకు ఆర్‌ జే కాజల్‌ ను మానస్ ఎంపిక చేసుకోవడం జరిగింది. మానస్‌ నిర్ణయంను కాజల్‌ స్వీకరించింది.

ఇక గొడవల విషయానికి వస్తే లహరి మరియు కాజల్ ల మద్య చిన్న చిన్నగా మొదలు అయ్యి గొడవ పెద్దగా అయ్యింది. మొదట కాజల్ ఇద్దరి మద్య ఏమైనా ఉంటే క్లోజ్‌ చేసుకుందాం అంటూ లహరితో కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేసింది. కాని లహరి మాత్రం ఇలా మాట్లాడితే వర్కౌట్‌ అవ్వదు అన్నట్లుగా తేల్చి పారేసింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మద్య కిచెన్‌ విషయంలో గొడవ షురూ అయ్యింది. కాజల్ కిచెన్‌ టీమ్‌ వారు అంతా కూడా కాస్త వర్క్ చేయాలి అన్నట్లుగా మాట్లాడుతున్న సమయంలో లహరి స్పందిస్తూ మీరు ఎందుకు కంటెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేసింది.

ఆ సమయంలో కాజల్‌ కాస్త ఓవర్ గా రియాక్ట్‌ అయ్యింది. దాంతో లహరికి మరింతగా కోపం వచ్చింది. ఇద్దరి మద్య కాస్త చర్చ జరిగింది. లహరి ఏమాత్రం తగ్గకుండా వాదనకు దిగితే కాజల్‌ మాత్రం సారీ చెప్పి అక్కడ నుండి వెళ్లి పోయింది. ఇక లోబో మరియు సిరిల గొడవ విషయానికి వస్తే ఇద్దరు మొదట అనుకుని ఆ తర్వాత గొడవ పడ్డట్లుగా నటించారు. అది కాస్త సీరియస్ అయ్యింది. ఇతరుల ఫీలింగ్స్ తో ఆడుకోవద్దు అంటూ కొందరు సూచించారు. ప్రాంక్ కాస్త వ్రాంగ్‌ అయ్యింది. మరో గొడవ అనీ మాస్టర్ మరియు జెస్సీల మద్య జరిగింది. పవర్ రూమ్‌ యాక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక సీటు పై జెస్సీ కూర్చుని మరో సీటుపై కాలు పెట్టాడు. సిరి కోసం ఆ కాలును అలా ఉంచాడు. కాని అనీ మాస్టర్ వచ్చిన సమయంలో అతడు కాస్త సీరియస్ గా స్పందించాడు.. అందుకు అనీ మాస్టర్ కూడా మరీ సీరియస్ అయ్యింది. ఇద్దరి మద్య మరీ వ్యవహారం ముదిరింది. ఆ తర్వాత మాస్టర్ కు జెస్సీకి సారీ చెప్పినా కూడా అది కాస్త సీరియస్ గానే మారింది.

ఫిజికల్‌ గా చాలా స్టాంగ్ అయిన విశ్వ మెంటల్ గా చాలా లో అన్నట్లుగా తాజా ఎపిసోడ్‌ లో నిరూపితం అయ్యింది. ఎందుకంటే రవి తనను అన్న అని పిలుస్తుంటే నాకు ఇటీవలే చనిపోయిన నా తమ్ముడు గుర్తుకు వచ్చాడు అంటూ విశ్వ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వారం ముందు కూడా వాడు నాతో చక్కగా మాట్లాడి అన్నయ్యలా నేను ఉంటాను అమ్మ అంటూ చెప్పాడు. కాని చనిపోయాడు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దాంతో రవి అతడిని ఓదార్చాడు. ఇద్దరు కూడా చాలా సమయం మాట్లాడుకున్నారు. ఇక బాత్‌ రూమ్‌ లో ఇష్యూ గురించి లోబో కొద్ది సమయం కామెడీ చేశాడు. కూరగాయలు కట్టింగ్‌ విషయంలో ఉమాదేవి కొంత చర్చ కు తీసుకు వచ్చింది. సరయు కాస్త బోల్డ్‌ వ్యాఖ్యలతో సిగరెట్ రూమ్‌ లో లోబోతో చర్చించింది. మొత్తానికి ఎపిసోడ్‌ 3 అలా అలా చిన్న చిన్న గొడవలు.. ఛాలెంజ్ లు.. కామెడీతో సాగింది.