Begin typing your search above and press return to search.

BIGGBOSS5: సరైన టైమ్‌ కు గేమ్‌ మొదలు పెట్టాడు

By:  Tupaki Desk   |   27 Oct 2021 7:50 AM GMT
BIGGBOSS5: సరైన టైమ్‌ కు గేమ్‌ మొదలు పెట్టాడు
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 5 లో స్టార్ కంటెస్టెంట్స్ జాబితాలో ముందు వరుసలో ఉండే వ్యక్తి షణ్ముఖ్‌ జస్వంత్‌ పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. అత్యధిక పారితోషికం ఇస్తూ షన్నూ ను బిగ్ బాస్ లోకి తీసుకున్నారు అంటూ షో ఆరంభంలో వార్తలు వచ్చాయి. టాప్‌ 3 పారితోషికాల్లో షన్నుది ఉంటుంది అంటూ కూడా స్టార్ మా వర్గాల వారి ద్వారా సమాచారం అందింది. అలాంటి షన్నూ హౌస్ లోకి వెళ్లిన తర్వాత గేమ్‌ పరంగా పూర్తిగా డల్‌ అయ్యి కనిపించాడు. ఎప్పుడు కూడా మోజ్‌ రూమ్‌ లో కూర్చుని సిరి మరియు జెస్సీ తో ముచ్చట్లు పెట్టడం.. లేదంట ఒక బాటిల్ చేతిలో పట్టుకుని అటు ఇటు తిరగడం.. తినడం... ఇక అప్పుడప్పుడు బెడ్‌ పై సిరితో పడుకోవడం ఏడవడం వంటివి చేస్తున్నాడు. ఈ విషయం అతడి అభిమానులకు తీవ్రంగా నిరాశ కలిగించింది. నాగార్జున పదే పదే అరే ఎంట్రా ఇది అంటూ ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయినా కూడా 50 రోజులు పూర్తి అయినా కూడా షన్ను తన ఆటను బయటకు తీయలేదు.

ఎట్టకేలకు షన్ను లో ఫైర్‌ కనిపించింది. తాజా ఎపిసోడ్ లో లోబోతో బురదలో ముత్యాలు ఏరే సన్నివేశంలో షన్నూ చాలా స్పీడ్ గా ఆడాడు. అతడు ఈ ఫిజికల్‌ టాస్క్ లో మెప్పించాడు. వందకు పైగా ముత్యాలను బురదలో ఏరి విజయం సాధించాడు. మొదటి సారి డైరెక్ట్‌ గా కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ గా నిలిచాడు. షన్నూ పై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. ఇతడి ఆట తీరు బాగా లేదు. ఫైనల్‌ 5 వరకు కూడా షన్నూ ఉంటాడా అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా షన్నూ పుంజుకున్నాడు. సిరి మరియు సన్నీ ఇంకా మానస్‌ శ్రీరామ్ లు దూసుకు వస్తున్న సమయంలో షన్నూ అనూహ్యంగా ఈ టాస్క్ లో విజేతగా నిలిచి ఇక చూడండి నా ఆట అంటూ ఈసారి తన గేమ్‌ తో సమాధానం చెప్పాడు.

సోషల్‌ మీడియాలో షన్నూకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో పోల్చితే షన్నూకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది అనడంలో సందేహం లేదు. యూట్యూబ్‌ సూపర్ స్టార్‌ గా షన్నూకు మంచి పేరు ఉంది. అలాంటి షన్నూ టాస్క్ లో కాస్త సీరియస్ గా ఆడితో అతడు ఈజీగా ట్రోఫీ నెగ్గుకు రాగలడు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గేమ్‌ సగం వరకు పూర్తి అయ్యింది. లేజీ షన్నూ అంటూ కామెంట్స్ తీవ్రం అవుతున్న సమయంలో షన్నూ పుంజుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇదే దూకుడు ముందు ముందు కూడా చూపిస్తే ఖచ్చితంగా ఒక అద్బుతమైన ఆటగాడిగా ఈ సీజన్ లో నిలుస్తాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. షన్నూ ఇదే జోరు కొనసాగిస్తాడా లేదంటే మళ్లీ మోజ్‌ రూమ్ లో ముచ్చట్లతో గడిపేస్తాడా అనేది చూడాలి.