Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E6 : నోరు జారిన పింకీ.. జైలుకు జెస్సీ

By:  Tupaki Desk   |   11 Sep 2021 2:57 AM GMT
#BIGGBOSS5TELUGU E6 : నోరు జారిన పింకీ.. జైలుకు జెస్సీ
X
వినాయక చవితి ప్రత్యేక ఎపిసోడ్ అవ్వడం వల్ల తాజా ఎపిసోడ్‌ లో ఇంటి సభ్యులు వినాయక పూజ చేసుకున్నారు. అదే సమయంలో ఇంటిని మిస్ అవుతున్నట్లుగా కన్నీరు పెట్టుకున్నారు. ఫస్ట్‌ టైమ్‌ ఇంట్లో వారితో పండుగ చేసుకోలేక పోతున్నాం అనే బాధ చాలా మందిలో కనిపించింది. రవి.. లోబో.. నటరాజ్ మాస్టర్‌ ఇంకా కొందరు కన్నీరు పెట్టుకుంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్బంగా ఇంటి సభ్యులు చేసిన హడావుడి... వారు రెడీ అయిన తీరు కలర్ ఫుల్‌ గా ఎపిసోడ్ మారేలా చేసింది. ఎపిసోడ్‌ మొత్తం కూడా వినాయక చవితి వేడుక మాత్రమే కాకుండా గొడవలు.. రొమాన్స్ లు.. కామెడీలు కూడా జరిగాయి. ఎపిసోడ్‌ ఆరంభంలో రాత్రి సమయంలో అంతా పడుకున్న తర్వాత మానస్ మరియు సన్ని వద్దకు వెళ్లి పింకీ తన వద్ద ఉన్న పువ్వును మానస్‌ కు ఇచ్చింది. దీనిని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీవు కెప్టెన్ అయ్యాక నేను ఇస్తాను.. నేను కెప్టెన్ అయితే నువ్వు నాకు ఇవ్వాలి అంటూ చెప్పింది. పక్కనే ఉన్న సన్నీ బాబోయ్‌ అంటూ వారి రొమాన్స్ కు ఫిదా అయ్యాడు. ఇక తెల్లారిన తర్వాత ఇంటి సభ్యుల టిఫిన్ విషయంలో కెప్టెన్‌ సిరి మాట్లాడింది. పూజ ఉంది కనుక లంచ్‌ ఆలస్యం అవుతుంది. కనుక టిఫిన్ ఎక్కువ చేయాలని సూచించింది.

కాజల్‌ కిచెన్ పని అస్సలు రాదు అంటూ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. శ్రీరామ చంద్ర ఇక్కడ ఎవరు కూడా వంట చేయలేదు. కాని అవసరం కొద్ది తప్పడం లేదు కదా అంటూ వ్యాఖ్యలు చేశాడు. మీరు కూడా వంట చేయకున్నా కనీసం కిచెన్ లో హెల్ప్‌ చేయాలి కదా అంటూ ఒప్పించే ప్రయత్నం చేశాడు. కాని కాజల్ మాత్రం తనకు అస్సలు కిచెన్ లో అడుగు పెట్టలేను అనే విషయాన్ని గట్టిగానే చెప్పే ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే కెప్టెన్ సిరి కూడా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నం చేసింది. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ లో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసుకుని ఒకరు ఎత్తుకుంటే మరొకరు పైన ఉన్న కుండలను పగుల కొట్టాలి. అయితే వారు కళ్లకు గంతలతో ఉంటారు. ఈ టాస్క్ విషయంలో నటరాజ్‌ మాస్టర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడిని రవి కాస్త కూల్‌ చేసే ప్రయత్నం కూడా చేశాడు. శ్రీరామ చంద్ర ఎత్తుకుని విశ్వతో కుండలు పగుల కొట్టించాడు. అలా లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ పూర్తి అయ్యింది.

చివరగా ఈ వారంలో బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌ మరియు వరస్ట్‌ ఫెర్మార్మర్ ఎవరు అంటూ బిగ్‌ బాస్‌ కు ఏకాభిప్రాయంతో తెలియజేయాలని సూచించగా ఒకొక్కరు ముందుకు వచ్చి తమ దృష్టిలో ఎవరు వరస్ట్‌ ఎవరు బెస్ట్‌ అనే విషయాలను చెప్పారు. బెస్ట్ గా ఎక్కువ మంది విశ్వ కు ఓటు వేశారు. లోబో కు కూడా పలువురు మద్దతు తెలిపారు. కాని విశ్వకు ఎక్కువగా పాజిటివ్‌ మార్కులు పడ్డాయి. ఇక వరస్ట్ అనే విషయానికి వస్తే ఎక్కువ శాతం మంది జెస్సీ గురించి మాట్లాడాడు. అతడు ఇంకా గేమ్‌ ను అర్థం చేసుకోలేక తిక మక పడుతున్నాడు. గేమ్‌ ను ఎందుకు అతిగా తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఉమాదేవిని కూడా ఎక్కువ శాతం మంది వరస్ట్ గా ఎంపిక చేశారు. అయితే ఆమె విషయంలో మాట్లాడిన వారిపై ఆమె సీరియస్ అయ్యింది.

ముఖ్యంగా ప్రియాంక మాట్లాడిన సమయంలో ఉమాదేవి సహనం కోల్పోయారు. దాంతో ఆమె మాటలు మరియు చూపు ప్రియాంకకు ఇరిటేషన్ ను తెప్పించాయి. దాంతో సహనం కోల్పోయిన ప్రియాంక పెద్ద వారు అయిన ఉమాదేవిని నోర్ముయి అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ వెంటనే ఉమాకు క్షమాపణ చెప్పేందుకు ప్రియాంక ముందుకు వచ్చింది. తల్లిదండ్రుల విషయం నేను తీయకుండానే ఆమె తీశావని అనడంతో కోపం వచ్చిందని ప్రియాంక వివరన ఇచ్చింది.

మొత్తం గా బెస్ట్‌ గా విశ్వను ఎంపిక చేయగా వరస్ట్‌ గా జెస్సీని ఎంపిక చేశారు. జెస్సీని జైలుకు పంపించారు. ఇంకా నిన్నటి ఎపిసోడ్‌ లో పవర్ రూమ్‌ వలన కోల్పోయిన రవి మరియు ప్రియాల వస్తువులు మరియు డ్రస్‌ లు వచ్చేశాయి. అయితే ప్రియా కు సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అవకాశం లేదని బిగ్ బాస్ తెలియజేశాడు. నేడు వీకెండ్‌ ఎపిసోడ్‌ అవ్వడం వల్ల నాగార్జున రాబోతున్నాడు. మరి నేటి ఎపిసోడ్‌ లో ఎవరికి చురకలు ఉంటాయి అనేది చూడాలి.