Begin typing your search above and press return to search.

పక్కా.. ఎన్టీఆర్‌ షో తో బిబి ఢీ!

By:  Tupaki Desk   |   12 Aug 2021 12:30 PM GMT
పక్కా.. ఎన్టీఆర్‌ షో తో బిబి ఢీ!
X
ఎన్టీఆర్ బుల్లి తెర రీ ఎంట్రీ షో ఎవరు మీలో కోటీశ్వరులు ఈ నెలలోనే టెలికాస్ట్‌ కు రంగం సిద్దం అయ్యింది. ఇప్పటికే బిగ్ బాస్ తో బుల్లి తెర ప్రేక్షకులకు ఎన్టీఆర్ దగ్గర అయ్యాడు. కనుక ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ఖచ్చితంగా మరింతగా సక్సెస్‌ ను దక్కించుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. రికార్డ్‌ బ్రేకింగ్‌ టీఆర్‌పీ రేటింగ్‌ ను జెమిని టీవీ దక్కించుకుంటుంది. ఎన్టీఆర్‌ షో వస్తున్న సమయంలో బిగ్‌ బాస్ షో ను స్టార్‌ మాలో ప్రసారం చేయడం అవసరమా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ షో మొదలు పెట్టిన మూడు లేదా నాలుగు వారాల తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అవ్వడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం బిబి 5 కు సంబంధించిన ప్రోమోను అన్న పూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. హోస్ట్‌ ఎవరు అంటూ ఇన్నాళ్లు చర్చలు జరుగుతున్నాయి. నాగార్జున మళ్లీ హోస్ట్‌ గా బాధ్యతలు నిర్వహించడం కూడా కన్ఫర్మ్‌ అయ్యింది. మొత్తానికి తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 సందడి మొదలు అయ్యింది. మరో వారం పది రోజుల్లో కంటెస్టెంట్స్ జాబితాను ఫైనల్‌ చేసి ఆ తర్వాత షో కోసం ఎంపిక అయిన వారిని 12 నుండి 15 రోజుల పాటు క్వారెంటైన్ కు పంపించబోతున్నారట.

కంటెస్టెంట్స్ ఎంపిక తుది దశకు చేరుకున్న ఈ సమయంలో కొత్త ప్రోమోలు వరుసగా రాబోతున్నాయి. బిగ్‌ బాస్ సీజన్‌ 5 విషయంలో నిర్వాహకులు చాలా పట్టుదలతో ఉన్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షో ను మించిన రేటింగ్‌ ను దక్కించుకునేలా హోస్ట్‌ తో ప్లాన్‌ చేయడం మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సెట్టింగ్‌ నిర్వాణం జరుగుతోంది. బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారు అంటూ ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. నిజంగానే ఆ జాబితాలో ఉన్న వారు షో కు వెళ్తే ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ ను కలిగించడం ఖాయం. కనుక ఎన్టీఆర్‌ షో కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.