Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6: బాలాదిత్య వెళ్లిపోయాడు.. తర్వాత తిరుపతి పిల్లకు టాటా

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:33 AM GMT
బిగ్ బాస్ 6: బాలాదిత్య వెళ్లిపోయాడు.. తర్వాత తిరుపతి పిల్లకు టాటా
X
బిగ్ బాస్ సీజన్ 6 మొదలై.. 70 రోజులు గడిచిపోయింది. పదకొండో వారంలోకి ఎంట్రీ ఇచ్చే వేళలో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు కంటెస్టెంట్లకు టాటా చెప్పేయటం ద్వారా.. హౌస్ లో మరింత వేడిపుట్టించేలా చేస్తున్నాడు బిగ్ బాస్. శనివారం ఎపిసోడ్ ను చూస్తే.. వీకెండ్ వేళ.. సరదా సరదా ఆటల్ని ఆడిస్తూ వాతావరణం తేలికపరిచేలా చేసిన బిగ్ బాస్.. చివర్లో ప్రింటెడ్ పేపర్ మీద వచ్చిన బాలాదిత్యను ఎలిమినేట్ అయినట్లుగా పేర్కొన్న వైనం హౌస్ మేట్స్ కు దిమ్మ తిరిగే షాకిచ్చేలా చేసింది.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన గీతూను గతవారం ఎలిమినేట్ చేసి హౌస్ మేట్స్ ను సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్.. ఈ శనివారం మరో బలమైన కంటెస్టెంట్ గా చెప్పే బాలాదిత్యను బయటకు తీసుకొచ్చేశాడు. దీంతో.. ఎవరికి ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ తో రుణం తీరిపోతుందన్న విషయంపై అంచనాలు వేసేందుకు ఏ మాత్రం ఛాన్సు ఇవ్వట్లేదు. ఆదివారం టెలికాస్టు అయ్యే ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వాసంతి ఎలిమినేట్ కావటం తథ్యమని తేల్చేస్తున్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం మెరీనా ఇంటి నుంచి బయటకు వచ్చేయనుందని భావించినా.. చివర్లో వాసంతిని బయటకు పంపినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు అవుతుందని చెబుతున్నారు. గత వారం చిత్తూరు యాసతో అందరిని ఆకర్షించిన గీతూ.. తన అటిట్యూడ్ తో చేజేతులారా హౌస్ నుంచి బయటకువచ్చేస్తే.. ఈ వారం మరో చిత్తూరు జిల్లాకు చెందిన వాసంతి బయటకు వచ్చేయటం ఖాయమంటున్నారు.

దీంతో.. ఈ తిరుపతి పిల్లకు అధికారికంగా టాటా చెప్పటం మాత్రమే మిగిలిందన్న మాట వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైన నాటి నుంచి ఈ పది వారాల పాటు.. తాను కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో మేకప్ మిస్ కాకుండా అందంగా ఉంటూ.. స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేసేలా చేయటంలో వాసంతి సక్సెస్ అయ్యిందంటున్నారు. బిగ్ బాస్ తర్వాత ఆమెకు గ్లామర్ అవకాశాలు తథ్యమంటున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాసంతి ఇప్పటికే గ్లామర్ ఇండస్ట్రీలో తన సత్తా చాటితే.. బిగ్ బాస్ సీజన్ 6లొ మిగిలినవారి మాదిరి అటిట్యూడ్ ప్రదర్శించకుండా తనదైన మార్కును వేసిందంటున్నారు.

అయితే.. మిగిలిన వారి మాదిరి ఉత్సాహంగా గేమ్ ఆడింది లేదని.. అయితే.. తన గ్లామర్ తో బిగ్ బాస్ హౌస్ కు కొత్త కళను తెచ్చిందన్న మాట వినిపిస్తోంది. శనివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన బాలాదిత్య మాత్రం గొప్పోడు.. మంచోడు అన్న ట్యాగ్ లైన్ తో పాటు.. ఛాన్సు లభిస్తే నీతి బోధ చేసేటోడన్న పేరును మూటగట్టుకొని బయటకు వచ్చాడని చెప్పాలి.