Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 : అనుకున్నదే జరిగింది.. అతడే టైటిల్ విన్నర్..!

By:  Tupaki Desk   |   18 Dec 2022 3:19 AM GMT
బిగ్ బాస్ 6 : అనుకున్నదే జరిగింది.. అతడే టైటిల్ విన్నర్..!
X
బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా ఎవరు గెలిచారు అన్నది లీక్ అయిపోయింది. బిగ్ బాస్ లీక్స్ ఈ మధ్య చాలా కామన్ అయ్యింది. అందుకే ఆడియన్స్ కి కూడా షో మీద ఇదివరకు ఉన్న ఎగ్జైట్మెంట్ లేకుండా పోయింది. బిగ్ బాస్ సీజన్ 6 లో టైటిల్ విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. మొదటి నుంచి విన్నర్ అతడే అన్న టాక్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న మొదలైంది. 15 వారాలు 105 రోజుల ఈ సీజన్ లో 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.

మొదటి నుంచి ఈ సీజన్ ఎందుకో చాలా డల్ గా అనిపించింది. ఆశించిన స్థాయిలో టి.ఆర్.పి కూడా తీసుకు రాలేకపోయారు. వీక్ డేస్ లో నీరసంగా సాగిన ఈ సీజన్ శని ఆదివారాల్లో నాగార్జున ఎపిసోడ్ కొంత ఎంటర్టైన్ చేశాయి. ఇక ఈ సీజన్ మొదటి నుంచి రేవంత్ మీదే అందరి గురి ఉంది. ఇండియన్ ఐడల్.. సింగర్ గా సూపర్ ఫాం లో ఉన్న రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ఆ నిమిషమే అతనే విన్నర్ అని కొందరు ఫిక్స్ అయ్యారు. అందుకే ఎక్కువ వారాలు నామినేషన్స్ లో ఉన్నా సరే అతన్ని సేఫ్ చేస్తూ స్ట్రాంగ్ ఓటింగ్ ని చూపించారు.

మొదటి వారం నుంచి టాప్ ఓటింగ్ లో ఉన్నాడు రేవంత్. అయితే రేవంత్ ఆట తీరు గురించి చూస్తే.. బిగ్ బాస్ సీజన్ 6 లో టాస్కుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి అతనే. ఎలాంటి టాస్క్ అయినా రేవంత్ దిగాడు అంటే మిగతా హౌస్ మెట్స్ కి వణుకు వచ్చేలా చేశాడు. అయితే అతని మాట తీరు మాత్రం కొద్ది మేరకు కొందరిని నొప్పించింది. తనకు నచ్చినట్టుగా మాట్లాడితే ఓకే తనని ఎదురించి.. తన పాయింట్స్ చూపించి మాట్లాడితే మాత్రం రేవంత్ తన నోటికి పని చెప్పేవాడు. మొదట్లో హౌస్ మెట్స్ మీద కొన్ని బూతులు కూడా వదిలాడు. ఆట లో కూడా అతను ఒక ఉన్మాదిలా ఆడుతున్నాడని హోస్ట్ నాగార్జునే వార్నింగ్ ఇచ్చారు.

ఇలా హౌస్ లో తన ఆట తీరు.. మాట తీరుతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న రేవంత్ సీజన్ 6 విన్నర్ గా నిలవడం విశేషం. ఈ సీజన్ సగం నుంచే రేవంత్ విన్నర్ అని డిసైడ్ అయ్యారు. అందుకే సగం సీజన్ నుంచి విన్నర్ ఎవరో ఫిక్స్ కాబట్టి మిగతా వారాల్లో రన్నర్ కోసమే ఈ టాస్క్ లన్ని అన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అయ్యారు. తన భార్య ప్రెగ్నెన్సీ టైం లో ఆమె పక్కన ఉండాల్సిన రేవంత్ అలా కాదని బిగ్ బాస్ సీజన్ 6 కి వచ్చాడు. ముందు నుంచి టైటిల్ విన్నర్ తనే అవుతానని బలంగా చెబుతూ వచ్చిన రేవంత్ అనుకున్నట్టుగానే టైటిల్ గెలిచాడు.

ఈ రోజు ఈవెనింగ్ ఆరు గంటల నుంచి ఫైనల్ ఎపిసోడ్ మొదలవుతుంది. రేవంత్ విన్నర్ అవగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచాడని తెలుస్తుంది. టాప్ 3లో కీర్తి.. టాప్ 4లో ఆది రెడ్డి.. టాప్ 5 లో రోహిత్ ఉన్నారు. సీజన్ 6 ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయకపోయినా బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం ఈ సీజన్ ని కూడా హిట్ చేసేశారు.