Begin typing your search above and press return to search.
హనీమూన్ కు వెళ్లిన బిగ్ బాస్ విన్నర్
By: Tupaki Desk | 20 Jan 2021 10:10 AM ISTహిందీ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన గౌహర్ ఖాన్ ఇటీవల సీజన్ 14 లో కూడా సందడి చేసింది. బిగ్ బాస్ లోకి రెండవ సారి వెళ్లిన అతి కొద్ది మంది కంటెస్టెంట్స్ లో గౌహర్ కూడా ఒకరు. ఈమె వివాహం డిసెంబర్ 25న జరిగింది. కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ తో కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈమె ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకుంది. జైద్ దర్బార్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు అనే విషయం తెల్సిందే. వీరిద్దరు పెళ్లి తర్వాత కాస్త ఆలస్యంగా హనీమూన్ కు వెళ్లారు. ఆ విషయాన్ని గౌహర్ ఖాన్ ఆనందంగా తెలియజేశారు.
నేను నా భర్త కలిసి ఫస్ట్ హనీమూన్ కు వెళ్తున్నాం. ఈ సమయంలో నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ గౌహర్ ఖాన్ పేర్కొంది. ఆనందంతో భర్త జైద్ దర్బార్ తో కలిసి గౌహర్ డాన్స్ చేసింది. బిగ్ బాస్ తర్వాత ఆమె కెరీర్ అనూహ్యంగా మారిపోయింది. బిజీ నటిగా కొనసాగడంతో పాటు బుల్లి తెరపై కూడా తరచు కనిపిస్తూ వచ్చింది. ఇక ఈమె ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన వివాదాస్పద వెబ్ సిరీస్ 'తాండవ్' లో కూడా కీలక పాత్రలో కనిపించింది. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన గౌహర్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నటిగా దూసుకు పోతుంది. ఈ సమయంలో పెళ్లి చేసుకోవడంతో ఆమె కెరీర్ ఎలా ఉంటుందాని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.