Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ విన్నర్.. ఒకే బ్యానర్ లో 3 సినిమాలు..!

By:  Tupaki Desk   |   6 March 2021 12:30 AM GMT
బిగ్ బాస్ విన్నర్.. ఒకే బ్యానర్ లో 3 సినిమాలు..!
X
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అభిజిత్. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయట. మధ్యలో పలు సినిమాలు చేసాడు. కానీ అవేవి అభిజిత్ కు గుర్తింపు తేలేకపోయాయి. అయితే ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు అభిజిత్. మళ్లీ బిగ్ బాస్ 4 రియాలిటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తానికి ఫైనల్ బిగ్ బాస్ టైటిల్ అభిజిత్ గెలిచాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచాడో లేదో అలా తనను ఓటేసి గెలిపించిన వారికీ, అండగా నిలిచిన సెలబ్రిటీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చాడు. బిగ్ బాస్ నుండి బయటికి రాగానే కంటెస్టెంట్స్ అంతా కూడా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు.

అయితే వాళ్లలాగే అభిజిత్ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాడు. ఇదిలా ఉండగా.. ప్రతిసారి బిగ్ బాస్ ప్రోగ్రాం నుండి బయటికి వచ్చే సెలబ్రిటీలు అందరూ కూడా మళ్లీ తెరపై కనిపించకుండా పోతున్నారు. ఆ సీసన్ లో పాల్గొన్న ఎవరో కొందరు మాత్రమే సినిమాలలో కనిపిస్తుంటారు. బిగ్ బాస్ తర్వాత కూడా అభిజిత్ సినిమాల్లోకి రాలేదు. ఇంతకాలం సైలెంట్ పాటించిన అభిజిత్.. త్వరలోనే వరుస సినిమాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తాజా సమాచారం ప్రకారం.. అభిజిత్ ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ తో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. అధికారికంగా విషయం బయటికి రాలేదు కానీ ఇండస్ట్రీలో త్వరలో ప్రకటన రానుందని టాక్. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ మన్మధుడు-2 తర్వాత ఏ సినిమా ఓకే చేయలేదు. మరి అభిజిత్ మూడు సినిమాలకు సైన్ చేశాడంటే చూడాలి. ఈ హీరో అదృష్టం ఎలా ఉందో!