Begin typing your search above and press return to search.

బిబి4 : ఇది బయట చూపించి ఇజ్జత్‌ తీయకండి ప్లీజ్‌ అంటూ అఖిల్‌ సోహెల్‌

By:  Tupaki Desk   |   26 Nov 2020 11:05 PM IST
బిబి4 : ఇది బయట చూపించి ఇజ్జత్‌ తీయకండి ప్లీజ్‌ అంటూ అఖిల్‌ సోహెల్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ ఈవారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ లో భాగంగా దెయ్యంతో ఆట టాస్క్‌ ను ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్‌ లో హఠాత్తుగా అద్దంలో అరియానాకు దెయ్యం కనిపించింది. దాంతో షాక్‌ అయ్యిన అరియానా ఏడుపు లంకించుకుంది. ఆ తర్వాత రకరకాలుగా ఇంటి సభ్యులను భయ పెట్టేందుకు ప్రయత్నించారు. బిగ్‌ బాస్‌ లేడీ వాయిస్‌ తో భయపెట్టే ప్రయత్నం విఫలం అయ్యింది. దెయ్యం వాయిస్‌ ను సోహెల్‌ మరియు హారికలు ఎంజాయ్‌ చేస్తూ రా చూసుకుందాం అంటూ అవహేళన చేసినట్లుగా మాట్లాడాడు. ఇక అవినాష్‌ అయితే పెళ్లి కాకుంటే పెళ్లి చేసుకుంటాను అంటూ తనదైన శైలిలో కామెడీ చేశాడు.

ఇక నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో అందరికి చుక్కలు చూపించారు. నిన్నటి ఎపిసోడ్‌ లో ధైర్యం చూపించి బీరాలు పోయిన అఖిల్‌ మరియు సోహెల్‌ లు నేటి ఎపిసోడ్‌ లో తడుపుకున్నారు. ముందుగా ఇంటి సభ్యులందరికి కూడా దెయ్యం సినిమా చూపించారు. ఆ తర్వాత ఒక చీకటి గదిలోకి వెళ్లాలంటూ టాస్క్‌ పెట్టారు. ఆ గదిలోకి వెళ్లిన తర్వాత వింత శబ్దాలు మరియు రకరకాల లైట్‌ లతో భయపెట్టారు. నిజం దెయ్యానే నేను చూశాను ఇది నాకు ఒక లెక్క కాదు అంటూ అఖిల్‌ సోహెల్‌ తో కలిసి వెళ్లాడు.

చాలా ధైర్యంగా రా చూసుకుందాం అంటూ లోనికి వెళ్లిన అఖిల్‌ మరియు సోహెల్‌ లు ఒక్క ఎఫెక్ట్‌ తో మొత్తుకున్నారు. అరుపులు మెరుపులతో ఇద్దరికి కూడా చుక్కలు కనిపించాయి. బాబోయ్‌ అంటూ భయంతో అరుపులు మొదలు పెట్టారు. బయటకు వచ్చి ప్లీజ్‌ బిగ్‌ బాస్‌ ఈ వీడియోను బయటకు చూపించొద్దు. ఇంత కండలు వేసుకుని భయపడితే ఇజ్జత్‌ పోతుంది. ప్లీజ్‌ ఇది మాత్రం టెలికాస్ట్‌ చేయవద్దంటూ అఖిల్‌ విజ్ఞప్తి చేశాడు. అఖిల్‌ ప్లీజ్‌ టెలికాస్ట్‌ చేయవద్దంటూ విజ్ఞప్తి చేసిన బైట్‌ ను కూడా ప్రసారం చేశారు. నేటి ఎపిసోడ్‌ మస్త్‌ మజా వస్తుందని ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. ప్రోమో చూస్తుంటే నవ్వు ఆగదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రోమోను మీరు ఒక లుక్కేయండి.