Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ 4'లో ఆ న‌లుగురు సూప‌ర్ హాట్

By:  Tupaki Desk   |   25 July 2020 4:30 AM GMT
బిగ్ బాస్ 4లో ఆ న‌లుగురు సూప‌ర్ హాట్
X
కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 4 ఈ ఆగ‌స్టులో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజై జోరుగా వైర‌ల్ అయ్యింది. మ‌హ‌మ్మారీ విజృంభ‌ణ‌తో బిగ్ బాస్ కొత్త సీజ‌న్ ఉంటుందా ఉండ‌దా? అన్న‌దానికి తెర దించుతూ ఇప్ప‌టికే ఇంటి స‌భ్యుల ఎంపిక సాగుతుండ‌డంతో టీవీక్ష‌కుల్లో ఒక‌టే ఉద్వేగం రెట్టించిన నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది. క్వారంటైన్ సీజ‌న్ కి స‌రిప‌డా వినోదం బిగ్ బాస్ తోనే సాధ్య‌మ‌ని భావించే వీరాభిమానులు ఉన్నారు.

అందుకేనేమో స్టార్ మా వాళ్లు 100 రోజుల పాటు ఇంటిలో ఉండి వినోదం పంచే బెస్ట్ స‌భ్యుల్ని వెతికి ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే బిగ్ బాస్ 4లో క‌నిపించే ముఖాల‌పై విస్త్ర‌త చ‌ర్చ సాగుతోంది. పోటీదారుల‌ పేరిట ఇన్ స్టా పేజీలు వైర‌ల్ గా చ‌ర్చ‌కొచ్చాయి. ఈసారి రేస్ లో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అంటే.. ముంబై బ్యూటీ శ్ర‌ద్ధా దాస్ .. ఐటెమ్ గాళ్ హంసానందిని.. తెలుగ‌మ్మాయి యామిని భాస్కర్.. ప్ర‌ముఖ తెలుగు కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్టార్ ... వీళ్ల‌తో ప‌టు తెలుగు ర్యాప్ సింగర్ నోయెల్ సీన్ .. ప్రముఖ జానపద గాయని మంగ్లీ కూడా సీజన్ 4 లో పోటీప‌డే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వీళ్ల‌కు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ క్రేజు నెల‌కొన్న నేప‌థ్యంలో నిర్వాహ‌కులు ఎంపిక చేసే వీలుంద‌ట‌.

ప్ర‌తిసారీ స్టార్ డ‌మ్ లేని పార్టిసిపెంట్స్ సెలెక్ష‌న్ పై విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఈసారి అలా కాకుండా జ‌నాద‌ర‌ణ ఉన్న‌వారిని మాత్ర‌మే తీసుకోవాల‌నేది బిగ్ బాస్ నిర్వాహ‌కుల ఆలోచ‌న‌. అందుకు త‌గ్గ‌ట్టే సోష‌ల్ మీడియాల్లో జ‌ల్లెడ ప‌డుతున్నార‌ట‌. పైన జాబితాలో వారంతా టాలీవుడ్ లో బిగ్ ట్ర‌య‌ల్స్ లో ఉన్న‌వాళ్లే. వీళ్లంతా జ‌నాల‌కు బాగా తెలుసు. అందుకే ఎంపిక చేస్తున్నార‌ట‌. కొరియోగ్రాఫ‌ర్లు.. గాయ‌నీగాయ‌కులు.. క‌థానాయిక‌లు.. ఐటెమ్ భామ‌ల‌తో ఈ కొత్త సీజ‌న్ కిక్కు పెంచ‌నుంద‌ని భావించ‌వ‌చ్చు.