Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E22 : ఫన్‌ డే.. వెళ్లి పోతూ లహరి కూడా అదేమాట

By:  Tupaki Desk   |   27 Sep 2021 4:35 AM GMT
#BIGGBOSS5TELUGU E22 : ఫన్‌ డే.. వెళ్లి పోతూ లహరి కూడా అదేమాట
X
తెలుగు బిగ్‌ బాస్‌ మూడు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో సరయు రెండవ వారంలో ఉమాదేవి ఎలిమినేట్ అవ్వగా తాజా ఆదివారం ఎపిసోడ్‌ లో లహరి ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్‌ అంటూ శనివారమే లీక్ అయ్యింది. అన్నట్లుగానే లహరి ఎలిమినేట్‌ అయ్యింది. మొదటి వారంలో చాలా అగ్రెసివ్‌ గా అనిపించిన లహరి ఆ తర్వాత తర్వాత తన పద్దతిని మార్చుకుంది. అనూహ్యంగా మూడవ వారం ఎలిమినేషన్ లోకి వెళ్లడం.. ఆమె కంటే అంతా కూడా స్ట్రాంగ్‌ వాళ్లే ఉండటంతో ఆమె సేవ్‌ అవ్వలేక పోయింది. లహరి ఎలిమినేట్ అయిన విషయం నాగార్జున ప్రకటించిన వెంటనే ఇంట్లో చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. లహరి మరియు ప్రియా ఇంకా రవిల మద్య చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ విషయమై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. వచ్చే వారం నుండి వీరు ముగ్గురి మద్య బాండింగ్‌ ఎలా ఉంటుందా అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో లహరి ఎలిమినేట్‌ అవ్వడం కాస్త షాకింగ్ గా ఉంది. లహరి ఎలిమినేట్ అనగానే రవి షాక్ అయ్యాడు. ఎలిమినేట్ అయ్యి స్టేజీ మీదకు వెళ్లిన లహరి ఇంటి సభ్యులు అందరి గురించి తన అభిప్రాయంను చెప్పింది.

లహరి ఎలిమినేషన్ ముందు సన్ డే ఫన్‌ డే అంటూ నాగార్జున ఇంటి సభ్యులతో పాటల ఆటలు ఆడించారు. పాటను గుర్తు పట్టి ఎవరైతే ముందు పాడుతారో ఆ టీమ్‌ విన్నర్‌. రెండు టీమ్‌ లుగా విడదీసి ఈ గేమ్‌ ఆడించారు. రెండు టీమ్స్ నుండి ఒకొక్కరు చొప్పున వస్తూ గేమ్‌ ఆడాల్సి ఉంది. గేమ్ లో భాగంగా పాట గెస్ చేసిన వారు ఆ పాటకు మరో పార్టనర్ ను ఎంపిక చేసుకుని డాన్స్ చేయాల్సి ఉంటుంది. అలా సరదాగా సందడిగా గేమ్ ను కొనసాగించారు. గేమ్‌ పూర్తి అయిన తర్వాత మానస్ ను సేవ్ చేశాడు. మానస్‌ సేవ్‌ అయిన సమయంలో ప్రియాంక ఆనందంతో గంతేసింది. గట్టిగా హగ్ చేసుకుని మానస్ కు శుభాకాంక్షలు చెప్పింది. ఆ తర్వాత మళ్లీ మరో గేమ్‌ ను ఇంటి సభ్యులతో ఆడించాడు. గేమ్‌ లో భాగంగా ఇద్దరు ఇంటి సభ్యులు కళ్లకు గంతలు కట్టుకుని ఉంటారు. వారిలో ఒకరు ఒక వస్తువు లేదా పదార్థంను టచ్‌ చేస్తూ మరొకరికి అది ఏంటీ అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేయాలి. అది ఏంటీ అనే విషయాన్ని వెంటనే గెస్‌ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో షణ్ను మరియు సిరిలు కలిసి ఆడారు. సిరి ఆవాలను తడిమి గుర్తించింది. కాని షణ్ను కు ఎంత ఎక్స్‌ ప్లైన్ చేసినా కూడా గుర్తించలేక పోయాడు. ఆ తర్వాత కొందరు గుర్తించారు కొందరు గుర్తు పట్టలేక పోయారు. మొత్తానికి ఈ ఆట కూడా చాలా సరదాగా సాగింది.

బిగ్‌ బాస్ హౌస్ నుండి బయటకు రాబోతున్న మూడవ కంటెస్టెంట్‌ ఎవరు అంటూ ప్రియా మరియు లహరిలను నిల్చోబెట్టి వారి పేర్లు ఉన్న రెండు లైట్లను పెట్టి ఏలైట్ అయితే గ్రీన్ అవుతుందో వారే విన్నర్‌ అంటూ నాగార్జున ప్రకటించి లహరి ఎలిమినేట్‌ అంటూ ప్రకటించాడు. లహరి వెళ్లి పోతున్న సమయంలో రవి షాక్ అయ్యాడు.. శ్వేత కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియాంక మరియు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమెను పంపించే సమయంలో ఎమోషనల్‌ అయ్యారు. ఆమె కాస్త స్ట్రాంగ్‌ గానే కనిపించినా కూడా కన్నీరు పెట్టేసుకుంది. హౌస్ నుండి వెళ్లి పోతున్న సమయంలో కూడా షణ్నూ ను నీ గేమ్ నువ్వు ఆడు అంటూ సిరి ని ఫాలో అవ్వదు అంది. అప్పుడే షణ్ను ఆ విషయంలో రియాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నించి వెనక్కు తగ్గాడు. సిరి కూడా లహరి చేసిన వ్యాఖ్యలకు సీరియస్ అయ్యింది.

స్టేజ్ పైకి వెళ్లిన తర్వాత ఇంటి సభ్యులతో తన జర్నీని చూసుకుని లహరి మరోసారి ఎమోషనల్‌ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఇంటి సభ్యులు అర్థం అవుతున్నారు.. ఇంతలో బయటకు వచ్చేశాను అంది. ఆ తర్వాత ఒకొక్కరి గురించి చెబుతూ అందరి గురించి కూడా పాజిటివ్ గానే మాట్లాడింది. అయితే షణ్ను వద్దకు వచ్చేప్పటిని సిరి నన్ను నామినేట్ చేసిందని నువ్వు నామినేట్‌ చేశావ్‌ రా అంటూ వ్యాఖ్యలు చేసింది. అందుకు అలా నేనేం చేయలేదు. అలా నువ్వు ఆలోచించడం వల్లే నువ్వు అక్కడ ఉన్నావు అన్నాడు. సిరి కూడా రియాక్ట్‌ అయ్యింది. ఇంతకు ముందు సరయు మరియు ఉమాదేవిలు ఇద్దరు కూడా వెళ్లి పోతూ షణ్ను మరియు సిరిలు కలిసి ఆడకూడదు అన్నారు. ఇప్పుడు లహరి కూడా అదే మాట అన్నది.