Begin typing your search above and press return to search.

అఖిల్‌ అస్సలు విన్నర్‌ కాలేడు గుర్తు పెట్టుకో..!

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:44 PM IST
అఖిల్‌ అస్సలు విన్నర్‌ కాలేడు గుర్తు పెట్టుకో..!
X
తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 4 నుండి 14వ వారం తర్వాత ఎలిమినేట్‌ అయిన మోనాల్‌ గజ్జర్‌ బయటకు వచ్చినప్పటి నుండి సోషల్‌ మీడియా.. వెబ్‌ మీడియా.. ఎలక్ట్రానిక్ మీడియా ఇలా అనేక రకాల మీడియాలతో బిజీ బిజీగా ఉంటుంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న మోనాల్‌ అభిజిత్ గురించి పలు వ్యాఖ్యలు చేయడంతో పాటు అఖిల్‌ విజేతగా నిలుస్తాడనే నమ్మకంను వ్యక్తం చేస్తూ వచ్చింది. మోనాల్‌ తో బిగ్ బాస్ చేసుకున్న ఒప్పందం వల్లే ఇన్ని రోజులు అక్కడ ఉండగలిగింది. అంతే తప్ప ఆమెకు ప్రత్యేకంగా ప్రతిభ ఏమీ లేదు అంటూ ఇప్పటికే విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

ఆమెను సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇటీవల మోనాల్‌ సోషల్‌ మీడియాలో బిబి4 విన్నర్‌ అఖిల్‌ అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఒక నెటిజన్‌ స్పందిస్తూ.. అఖిల్‌ అస్సలు బిగ్‌ బాస్ విన్నర్‌ అవ్వలేడు గుర్తు పెట్టుకో మోనాల్‌ అంటూ నిర్మొహమాటంగా కామెంట్‌ చేశాడు. అతడి వ్యాఖ్యలకు మోనాల్‌ ప్రతిస్పందించింది. ఎందుకు అలా మాట్లాడుతారు.. ఈసారి ది బెస్ట్‌ పర్సన్‌ విజేతగా నిలుస్తారు. ఎవరు గెలుస్తారు అనేది మీరు ఒక్కరు డిసైడ్‌ ఎలా చేస్తారు. అఖిల్‌.. అభిజిత్.. సోహెల్‌.. హారికల్లో ఎవరు విజేతగా నిలిచినా కూడా నాకు హ్యాపీగానే ఉంటుందని మోనాల్‌ తన వ్యాఖ్యలను సరి చేసుకుంది. అఖిల్‌ కు మోనాల్‌ బటయకు వచ్చి కూడా మద్దతు ఇవ్వడంను కొందరు ఒప్పుకోవడం లేదు.