Begin typing your search above and press return to search.

పులిహోర రాజా ట్యాగ్‌ కు న్యాయం చేస్తున్న అఖిల్‌

By:  Tupaki Desk   |   8 Dec 2020 9:19 AM IST
పులిహోర రాజా ట్యాగ్‌ కు న్యాయం చేస్తున్న అఖిల్‌
X
బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఆరంభంలో అభిజిత్‌ ను అంతా కూడా పులిహోర రాజా అంటూ పిలిచేవారు. ఆ తర్వాత అతడి స్థానం ముక్కు అవినాష్‌ తీసుకున్నాడు అనిపించింది. ఇంట్లో అందరు అమ్మాయిల వద్దకు వెళ్లి పులిహోర కలపుతూ ఉండటంతో అతడు పెద్ద పులిహోర రాజా అంటూ స్వయంగా నాగార్జున పేరు పెట్టాడు. అవినాష్‌ చేసేది మొత్తం కామెడీ కోసమే అని తేలిపోయింది. అవినాష్‌ తర్వాత ఇప్పుడు అఖిల్‌ పులిహోరా రాజా అనిపించుకుంటున్నాడు. అఖిల్‌ గత రెండు మూడు వారాలుగా మోనాల్‌ తో మాత్రమే కాకుండా అరియానా మరియు హారికలతో తెగ కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు.

నిన్నటి ఎపిసోడ్‌ లో అరియానాను ప్రసన్నం చేసేందుకు ఎన్నో మాటలు చెప్పిన అఖిల్‌ ఆ తర్వాత హారికను ముద్దు ఇవ్వమంటూ గొడవ చేయడం జరిగింది. రాజుగా ఉన్న సమయంలో అనూహ్యంగా సోహెల్‌ వచ్చి హారికను ముద్దు పెట్టుకున్నాడు. దాంతో నాకు కూడా ఒక ముద్దు అంటూ అల్లరి చేసినట్లుగా అడిగాడు. అందుకు హారిక సీరియస్‌ అవ్వక పోగా రాజుగా ఉన్నప్పుడు నేను ఎలా ఇస్తాను. అవన్ని తర్వాత చూసుకుందా అంటూ ఒప్పుకున్నట్లుగానే అనిపించింది. గత కొన్ని రోజులుగా హారికకు హగ్గింగ్స్‌ ఇవ్వడంతో పాటు అరియానాను మాటలతో పడేసేందుకు ప్రయత్నిస్తూ అఖిల్‌ వస్తున్నాడు.

సోహెల్‌ మరియు అఖిల్‌ లు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో హారిక పిలిచింది. వెంటనే సోహెల్‌ ను వదిలేసి హారిక వద్దకు వెళ్లి ఆమె తినేది తినేశాడు. అఖిల్‌ ఈ వారం నామినేషన్‌ లో లేకపోవడంతో పూర్తి స్వేచ్చగా ఆడుకుంటున్నాడు. ఇతరులు పడుతున్న టెన్షన్‌ ను ఎంజాయ్‌ చేస్తు తన పులిహోర పనులు చేస్తూనే ఉన్నాడు. అఖిల్‌ సీజన్‌ ఆరంభంలో చాలా రిజర్వ్‌ గా అనిపించాడు. కాని ఇప్పుడు అతడి తీరు అనూహ్యంగా మారింది. మోనాల్‌ తో మాత్రమే అనుకుంటే ఇప్పుడు అందరితో కూడా ఆయన వ్యవహారం సాగుతోంది. ఈ వ్యవహారాలు చివరి వారంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.