Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో ఉండాలంటే కష్టపడితే సరిపోదు

By:  Tupaki Desk   |   17 Nov 2020 9:45 AM IST
బిగ్‌ బాస్‌ లో ఉండాలంటే కష్టపడితే సరిపోదు
X
తెలుగు బిగ్‌ బాస్‌ ఈ సీజన్‌ లో ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్‌ జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు అంటూ మొదటి నుండి ప్రేక్షకులు మరియు ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చిన వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాస్త లోతుగా విశ్లేషిస్తే అదే నిజమా అనే అనుమానం కలుగక మానదు. టీవీ9 దేవి ఎలిమినేట్‌ అయిన సమయంలో మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల ప్రకారం ఆమెను ఎలిమినేట్‌ చేశారా అంటే ఖచ్చితంగా కాదు. ఆమె వల్ల పెద్దగా ఫుటేజ్‌ రావడం లేదు. టాస్క్‌ ల్లో బాగానే ఆడుతున్నా ఇతర సమయాల్లో ఫుటేజ్‌ రావడం లేదు. దానికి తోడు టాస్క్‌ ల్లో కూడా ఆమె పెద్దగా వివాదాస్పదం అయిన దాఖలాలు లేవు. అందుకే ఆమెను ఎలిమినేట్‌ చేశారు అనే విమర్శలు వచ్చాయి.

మోనాల్‌ ఆట విషయంలో ఏమాత్రం ఫోకస్‌ అనిపించదు. ఇప్పటి వరకు ఆమె పలానా టాస్క్‌ లో ఆహా ఓహో అన్నట్లుగా లేదు. అయినా కూడా ఆమె ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. కారణం ఆమె వల్ల ఫుటేజ్‌ ఫుల్‌ గా వస్తుంది. ఆమె ఏడిచే ఫుటేజ్‌ అఖిల్‌ మరియు అభిజిత్‌ లతో ఉండే ఫుటేజ్‌ తో పాటు ఆమె స్కిన్‌ షో చేస్తే హౌస్‌ కు కళ వస్తుందని నిర్వాహకులు భావించి ఆమెను పలు సార్లు సేవ్‌ చేశారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కుమార్‌ సాయి కంటే మోనాల్‌ ఎలా బలమైన కంటెస్టెంట్‌ అనే విషయం ఇప్పటికి ఎవరు చెప్పలేక పోతున్నారు. కాని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు మాత్రం కుమార్‌ సాయి కంటే మోనాల్‌ స్ట్రాంగ్‌ అంటూ తేల్చి కుమార్‌ ను బయటకు పంపించారు.

ఇక ఈ వారం ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చిన మెహబూబ్‌ విషయంలో కూడా అదే జరుగుతుంది. మెహబూబ్‌ చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌. కాని ఆయన కేవలం టాస్క్‌ లు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు. ఏదైనా డాన్స్‌ అప్పుడు సందడి చేస్తున్నాడు. అంతకు మించి గొడవలు పడటం చేయడం లేదు. అందరితో బాగా ఉండేందుకు ప్రయత్నించడం వల్ల మెహబూబ్‌ స్ట్రాంగ్‌ అయినా కూడా కంటెంట్‌ ఇవ్వడం లేదనే కారణంతో ఎలిమినేట్‌ చేశారు.

ఈ సీజన్‌ లో కేవలం కష్టపడితే ఉండటం లేదు. పుటేజ్‌ ఇచ్చే విధంగా ఏమైనా చేస్తేనే ఉంటున్నారు. అభిజిత్‌ టాస్క్‌ ల్లో పెద్దగా ప్రభావం చూపకున్నా ఫుటేజ్‌ ఇచ్చే విషయంలో ఆయన చాలా ముందు ఉంటాడు. ఆయన మార్క్‌ డైలాగ్ష్‌ విశ్లేషణ ఇతరులతో గొడవ కారణంగా ఆయన ఉంటున్నాడు. ఇలా అంతా కూడా గొడవలు పెట్టుకుంటూ ఉండటం వల్లే హౌస్‌ లో కొనసాగుతున్నారు. లాస్య ఎవరితో గొడవలు పడదు కనుక తర్వాత ఎలిమినేషన్‌ ఆమేనా అంటున్నారు.