Begin typing your search above and press return to search.
బిబి4 : ఎలిమినేషన్ డ్రామా అట్టర్ ప్లాప్
By: Tupaki Desk | 12 Nov 2020 2:20 PM ISTతెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ వీక్ డేస్ ఎపిసోడ్స్ రేటింగ్ ను పెంచేందుకు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం మాత్రం దక్కడం లేదు. వీకెండ్ ఎపిసోడ్ లను ఏదో మాదిరిగా గట్టేకిస్తున్న క్రియేటివ్ టీమ్ వీక్ డేస్ రేటింగ్ పెంచడంలో మాత్రం సక్సెస్ కాలేక పోతున్నారు. వారం వారం కొత్త కొత్తగా ప్రయత్నించినా కూడా బెడిసి కొడుతున్నాయి.
నిన్నటి ఎపిసోడ్ లో ఫేక్ ఎలిమినేషన్ ను ప్లాన్ చేశారు. ఇంటి సభ్యులు తమ కు గట్టి పోటీ అనుకున్న వారిని చెప్పి వారిని బయటకు పంపాలంటూ సూచించారు. ఇంటి సభ్యులు అంతా కూడా ఏకాభిప్రాయంతో అఖిల్ తమకు పోటీ అంటూ నిర్ణయానికి వచ్చి అతడిని ఎలిమినేట్ చేసేందుకు నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
దాదాపు మూడు గంటల పాటు ఇంటి సభ్యులు చర్చించి తల బద్దలు కొట్టుకుని చివరకు ఒక వ్యక్తిని ఎంపిక చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ తెలుసు. ప్రేక్షకులు కూడా దీనిని ఫేక్ ఎలిమినేషన్ అంటూ అనుకున్నారు. ఈజీగా ఈ విషయమై అందరికి క్లారిటీ వచ్చేసింది. ప్రేక్షకులు అబ్బా ఏంటీ ఈ నస అన్నట్లుగా సాగింది. తెలుగు బిగ్ బాస్ వీక్ డేస్ ను చూడాలంటే ఇప్పటికే ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు.
ఇలాంటి ఎపిసోడ్ లు మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తే మరింతగా రేటింగ్ పడిపోయే అవకాశం ఉంది. ఎలిమినేషన్ డ్రామా రక్తి కట్టక పోగా చాలా చిరాకు పెట్టించింది. అఖిల్ బయటకు వెళ్లి సీక్రెట్ రూంలోకి వెళ్లిన తర్వాత కూడా పెద్దగా ఆసక్తిగా సాగలేదు. ఎలిమినేషన్ డ్రామా పెద్దగా సక్సెస్ అవ్వక పోవడంతో పాటు అఖిల్ బయటకు వెళ్లిన తర్వాత కూడా బోర్ గా సాగింది. మొత్తానికి ఎపిసోడ్ మళ్లీ బోర్ కొట్టింది.