Begin typing your search above and press return to search.

బిబి4 : ప్రేక్షకులను కదిలించిన హారిక.. అరియానా కన్నీరు

By:  Tupaki Desk   |   16 Oct 2020 12:07 PM IST
బిబి4 : ప్రేక్షకులను కదిలించిన హారిక.. అరియానా కన్నీరు
X
తెలుగు బిగ్‌ బాస్‌ నిన్నటి ఎపిసోడ్‌ ఎమోషనల్‌ గా సాగింది. ప్రతి సీజన్‌ లో ఏదో ఒక సందర్బంలో కంటెస్టెంట్‌ చిన్నప్పటి విషయాలు లేదా కుటుంబంలోని విషయాలను మాట్లాడే వీలు కల్పిస్తారు. ఆ సందర్బం ప్రతి సీజన్‌ లో కూడా ప్రేక్షకులను కదిలిస్తుంది. ఇక ఈ సీజన్‌ లో కూడా నిన్నటి ఎపిసోడ్‌ లో కంటెస్టెంట్స్ చిన్నప్పటి విషయాలు.. జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనలు కన్నీరు తెప్పించే విషయాలను ఇతర ఇంటి సభ్యులతో మరియు ప్రేక్షకులతో షేర్‌ చేసుకున్నారు. చిన్నప్పటి ఫొటోలు డిస్‌ ప్లే చేయడంతో మొదలైన ఈ ఎమోషనల్ టాస్క్‌ లో అరియానా నుండి వరుసగా దాదాపు అంతా కూడా తమ చిన్నప్పటి జ్ఞాపకాలను షేర్‌ చేసుకున్నారు. పలువురు వారు చిన్నప్పుడు పడ్డ బాధలను ఆర్థిక ఇబ్బందులను షేర్‌ చేసుకున్నారు.

అరియానా తన అమ్మానాన్నలు చిన్నప్పుడే విడిపోయారు. అమ్మ ప్రభుత్వ ఉద్యోగి అవ్వడం వల్ల చాలా కష్టపడి మమ్ములను పెంచింది అంటూ అమ్మను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యింది. తన అసలు పేరు అరియానా కాదు అర్చన అంటూ కూడా ఆమె మొదటి సారి తన అసలు పేరును రివీల్‌ చేసింది. మోనాల్‌ చిన్నతనంలో చాలా ఇబ్బందులు పడ్డామంటూ ఎప్పటిలాగే కన్నీరు పెట్టుకుంది. ఇక దేత్తడి హారిక ఎప్పుడు కూడా చాలా యాక్టివ్‌ గా ఉంటూ నవ్వుతూ ఉండేది. కాని నిన్న అమ్మా నాన్నల విషయం మాట్లాడుతున్న సమయంలో ఆమె కన్నీరు ఆగలేదు. ఎంతగా కన్నీరు ఆపుకునేందుకు ప్రయత్నించినా కూడా ఆమెకు సాద్యం కాలేదు.

అమ్మానాన్న విడిపోయిన విషయాన్ని ఆమె చెప్పి నాన్న ను మిస్‌ అవుతున్నాము అని.. అన్నయ్య నాకు నాన్నగా మారి నన్ను చూసుకుంటున్నాడు అంటూ చెప్పి ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఇక లాస్య మాట్లాడుతూ తాను కడుపులో ఉన్న సమయంలో మా అమ్మ గడ్డి కోసేందుకు వెళ్లి అక్కడ పురుడు నొప్పులు మొదలు అవ్వడంతో కిలో మీటరు దూరం నడిచి వచ్చి నన్ను కన్నది అంటూ కన్నీరు పెట్టుకుంది. నాన్న ను నేను చాలా బాధ పెట్టాను.

మంజునాధ్‌ ను చేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. మంజునాథ్‌ ను కూడా నేను ఏడు సంవత్సరాల పాటు పెళ్లి చేసుకుని గుర్తింపు ఇవ్వలేదు అంటూ లాస్య కన్నీరు పెట్టుకుంది. సోహెల్‌, మెహబూబు, అమ్మరాజశేఖర్‌, నోయల్‌ లు కూడా తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుని ఎమోషనల్‌ అయ్యారు. అభిజిత్‌ మరియు కుమార్‌ సాయి, దివిలకు సంబంధించిన విషయాలను టెలికాస్ట్‌ చేయలేదు.