Begin typing your search above and press return to search.
ఆ విషయం చెప్తే నన్ను దున్నేస్తారు..అంటున్న తెలుగు బ్యూటీ
By: Tupaki Desk | 7 April 2020 4:40 PM ISTటాలీవుడ్ లోకి ఆవకాయ బిర్యాని సినిమాతో అరంగేట్రం చేసిన తెలుగు అమ్మాయి బిందుమాధవి. చక్కనైన కట్టు బొట్టుతో మొదటి సినిమాలో మెప్పించినప్పటికీ పెద్దగా అవకాశాలు అందుకోలేక పోయింది. తెలుగులో అడపాదడపా కన్పించింది బిందు కానీ తన కెరీర్ లో సరైన బ్రేక్ దొరకలేదు. ఆ తర్వాత ఈ తెలుగు బ్యూటీ తమిళ సినిమాల అవకాశాలతో బిజీ అయి పోయింది. చాలాకాలం తర్వాత సోషల్ మీడియా లో కనిపించి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. తెలుగులో బంపర్ ఆఫర్ - ఓం శాంతి - రామ రామ కృష్ణ కృష్ణలాంటి సినిమాల్లో అటు గ్లామర్ తోను ఇటు నటనతోను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బిందు తెలుగులో కనిపించిన చివరి సినిమా పిల్ల జమిందార్. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన బిందు మాధవి ఇకనైనా కెరీర్ ని చక్కదిద్దుకునే ఆలోచనలో ఉందట. ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. తెలుగులో ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. అనంతరం తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తూ.. నాకు ఓ సీక్రెట్ అఫైర్ ఉంది. ఇంకా కమిట్ కాలేదు. అయితే ఆ విషయం ఇప్పుడే బయటికి చెప్పలేను అంటుందట. బయటకు చెప్పితే ఇక మీడియాలో దున్నేస్తారంటుంది. ప్రస్తుతానికి మాత్రం సింగిల్.. అనే జవాబిస్తుంది. చివరగా తమిళంలో పక్కా, కజగు 2 సినిమాలలో కనిపించిన అమ్మడు ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాలతో బిజీగా గడుపుతుందట. తెలుగు లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుందట. చూడాలి మరి అమ్మడు మళ్లీ తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం చేస్తుందేమో..