Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బిగ్ బాస్ స్టార్లు హంగామా చూశారా?

By:  Tupaki Desk   |   28 Nov 2020 11:15 AM IST
ఫోటో స్టోరి: బిగ్ బాస్ స్టార్లు హంగామా చూశారా?
X
బుల్లితెర వెండితెర ఒకేచోట క‌లిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్క‌డ అలాంటి స‌న్నివేశ‌మే క‌నిపిస్తోంది. అందాల యాంక‌ర్ కం న‌టి హిమ‌జ ఇటీవ‌ల ఓ ఫేమ‌స్ చీర‌ల షాపింగ్ బ్రాండ్ కి ప్ర‌చారం చేస్తున్నారు. బిగ్ బాస్ బ్రాండ్ ఇమేజ్ ని హిమ‌జ తెలివిగానే ఎన్ క్యాష్ చేసుకుంటున్నార‌న్న ప్ర‌చారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ కొత్త‌గా షోరూమ్ లాంచ్ చేసినా హిమ‌జ ప్ర‌చారంతో ఆ వేడుక హైలైట్ అవుతోంది. ఇటీవ‌ల ఏపీ టూటైర్ సిటీస్ అన‌కాపల్లి- తుని లాంటి చిన్న న‌గ‌రాల్లో మాల్స్ ప్రారంభోత్స‌వాల్లోనూ హిమ‌జ సంద‌డి చేశారు.

ఈసారి రొటీన్ కి భిన్నంగా షాపింగ్ లాంచ్ లో ఏకంగా బిగ్ బాస్ సీజ‌న్ 3 స్టార్లంతా ప్ర‌త్య‌క్ష‌మవ్వ‌డం క‌న్నుల‌పండుగ‌నే త‌ల‌పించింది. హిమ‌జ‌తో పాటు సీనియ‌ర్ న‌టి హేమ‌-టీవీ యాంక‌ర్ శివ‌జ్యోతి-రోహిణి-అషు రెడ్డి త‌దిత‌రులు ప‌ట్టు చీర‌ల్లో ఒకే ఫ్రేమ్ లో త‌ళ‌త‌ళా మెరిసిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. విజ‌య‌వాడ‌లో ప్ర‌ఖ్యాత షాపింగ్ మాల్ లో ప్ర‌చార‌ కార్య‌క్ర‌మ‌మిది.

సంపాద‌న మ్యాట‌ర్ కొస్తే.. బిగ్ బాస్ స్టార్లుగా వీరంతా బాగానే ఆర్జిస్తున్నారు. హిమ‌జ.. శివ‌జ్యోతి ఇంత‌కుముందు సొంత ఇంట్లోకి లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఖ‌రీదైన బ్రాండెడ్ కార్ల‌ను వీరంతా సొంతం చేసుకుని సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేయ‌గా ఆ ఫోటోలు జోరుగా వైర‌ల్ అయ్యాయి.