Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ సీజన్ సిక్స్...ముహూర్తం ఫిక్స్... ?
By: Tupaki Desk | 20 Dec 2021 11:07 AM ISTతెలుగులో బిగ్ బాస్ ఏ సీజన్ అయినా అదరగొడుతోంది. ఒకదానికి మించి మరో సీజన్ సూపర్ సక్సెస్ అవుతోంది. కరోనా కారణంగా గత ఏడాది, ఈ ఏడాది సీజన్లు కొంత లేట్ గా స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా విజయవంతంగా ముగిసాయి. బిగ్ బాస్ కి ఆదరణ కూడా ఏ సీజన్ కి ఆ సీజన్ లో పెరిగిపోతోంది అని టీయార్పీ రేటింగ్ చెబుతోంది. ఇదిలా ఉంటే 105 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సూపర్ డూపర్ హైప్ క్రియేట్ చేసి మరీ సాఫీగా ముగిసింది.
ఆర్జే సన్నీ విన్నర్ గా నిలిచి కోట్లాది మంది జనాల మెప్పు అందుకున్నాడు. దాంతో ఆయన ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సన్నీకి గత సీజన్లలో విన్నర్లకు వచ్చిన దాని కంటే ఎక్కువగా గిఫ్టులు దక్కాయి. ఒక విధంగా సన్నీ లక్కీ అని కూడా అంతా అంటున్నారు. ఆయనకు సువర్ణ భూమి వారు ప్రైమ్ లోకాలిటీలో వేసిన లేటెస్ట్ వెంచర్ లో మూడు వందల గజాల వీఐపీ ప్లాట్ ఇవ్వడంతో పాటు, బిగ్ బాస్ నిర్వాహకుల యాభై లక్షల క్యాష్ ప్రైజ్, ఇక స్పోర్ట్స్ బైక్ కూడా బహుమతిగా లభించడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ట్రోఫీని సన్నీకి ఇచ్చిన తరువాత హోస్ట్ నాగార్జున సీజన్ సిక్స్ గురించి అదే వేదిక మీద అనౌన్స్ చేసి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా తరువాత సీజన్ మరో రెండు నెలలలో ప్రారంభం అవుతుంది అని నాగార్జున చెప్పేశారు. అంటే ఇప్పటి నుంచే సీజన్ సిక్స్ కి సెలెక్షన్స్ మొదలవుతాయి అన్న మాట.
అన్నీ చూసుకుని మార్చిలో దాన్ని ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే సమ్మర్ దాకా ఆ సీజన్ సాగితే 2022 సెకండ్ హాఫ్ లో సీజన్ సెవెన్ కూడా వచ్చే చాన్స్ ఉంది అంటున్నారు. తెలుగులో బిగ్ బాస్ కి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకునే ఇక మీదట ఏడాదికి రెండు సీజన్లతో స్పీడు పెంచి బిగ్ బాస్ ని ప్రతీ ఇంటికీ పండుగలా తీసుకురాబోతున్నారన్న మాట. మొత్తానికి బిగ్ బాస్ ప్రేమికులకు నాగ్ హుషారెత్తించే న్యూస్ చెప్పేశారు అనుకోవాలి.