Begin typing your search above and press return to search.

బిబి4 : మంట పెట్టారు.. నేటి నుండి రచ్చే

By:  Tupaki Desk   |   21 Sept 2020 2:00 PM IST
బిబి4 : మంట పెట్టారు.. నేటి నుండి రచ్చే
X
మొన్నటి వరకు సేఫ్‌ గేమ్‌ ఆడుతూ వస్తున్న బిగ్‌ బాస్‌ ఇంటి సభ్యులు అందరిని కూడా శని ఆదివారాల ఎపిసోడ్‌ లో నాగార్జున సెట్‌ చేశాడు. ఒకరిపై ఒకరికి కోపం వచ్చేలా ఒకరి గురించి ఒకరు ఏం అనుకుంటున్నారు అనే విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చేలా చేశాడు. ఖచ్చితంగా నేటి నుండి బిగ్‌ బాస్‌ లో రచ్చ రచ్చగా ఉండటం కన్ఫర్మ్‌ అనిపిస్తుంది. ఎలిమినేషన్‌ విషయంలో గత వారంలో జరిగిన తప్పును మళ్లీ జరుగకుండా ఉండాలంటూ సీరియస్ గా వార్నింగ్‌ ఇవ్వడంతో ఇకపై ఎవరికి వారు సెల్ఫ్‌ నామినేషన్‌ అవకాశమే లేదు అంటున్నారు.

హీరో విలన్‌ టాస్క్‌ మరియు ఫేక్‌ ఎలిమినేషన్‌ సందర్బంగా మోనాల్‌ మరియు హారికల గురించి ఇంటి సభ్యులు చెప్పిన విషయాలు కాని కళ్యాణి వెళ్లి పోయే ముందు చెప్పిన విషయాలు కాని అన్ని కూడా నేటి నుండి ప్రభావం చూపిస్తాయి అనడంలో సందేహం లేదు. లాస్య మరియు దివిల మద్య జరిగిన చిన్న వాటి గొడవ అది మరింత పెద్దగా అవ్వడం ఖాయం అలాగే మోనాల్‌ గురించి దివి నమ్మకం కోల్పోయింది అంటూ చేసిన వ్యాఖ్యలు కాని మొత్తం షోను మార్చేస్తాయి అనిపిస్తుంది. ఇకపై ఒకరిపై ఒకరు అభిమానం చూపించుకుంటారేమో కాని సమయం వచ్చినప్పుడు అసలు విషయం బయటకు రావడం ఖాయం.

అమ్మ రాజశేఖర్‌ మరియు నోయల్‌ లను కూడా చాలా మంది తప్పుగా అనుకోవడం కొందరు వారిని విలన్‌ అంటూ ప్రజెంట్‌ చేసి చూపించడం వంటివి చేయడం వల్ల వారు కూడా ఈ వారం ఎలా ప్రవర్తిస్తారు అనేది చూడాలి. నిన్నటి ఎపిసోడ్‌ లో హారిక స్ట్రాంగ్‌ కాదు అంటూ మెహబూబ్‌ చేసిన వ్యాఖ్యలకు నేటి ఎపిసోడ్‌ లో హారిక చాలా సీరియస్‌ గా రియాక్ట్‌ అవ్వడం మనం చూడవచ్చు. మొత్తానికి నేటి నుండి ఈ వారం మొత్తం కూడా షో రచ్చ రచ్చ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోంది.