Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ అబ్బో పున్నూలో ఆ యాంగిల్ కూడా బాగానే ఉందిగా

By:  Tupaki Desk   |   7 Oct 2019 8:16 AM GMT
బిగ్‌ బాస్‌ అబ్బో పున్నూలో ఆ యాంగిల్ కూడా బాగానే ఉందిగా
X
సన్ డే ఫన్ డే...అంటూ ప్రతి ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్లో సందడి చేసే కింగ్ నాగార్జున ఈ ఆదివారం ఎపిసోడ్‌లో కూడా ఇంటి సభ్యులతో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. నవరాత్రులు సందర్భంగా ఇంటిలోని 9 మంది సభ్యులు నవరసాలు పండించాలని సరదా టాస్క్ ఇచ్చారు. ఒక్కో సభ్యుని ప్రదర్శన బట్టి మార్కులు వేయాలని మిగతా సభ్యులకు చెప్పారు. ఇందులో మొదట వచ్చిన వరుణ్.. తనకు తగ్గట్టుగా శాంత రసం చేసి పర్వాలేదనిపించాడు. తర్వాత ఇచ్చిన పునర్నవికి శృంగార రసం ఇచ్చారు. ‘సిగ్గేస్తుంది నిను చూస్తుంటే’ అనే సాంగ్ కు డ్యాన్స్ వేస్తూ పున్నూ బాబా భాస్కర్ ని రెచ్చగొట్టింది.

ఓ రకంగా చెప్పాలంటే పున్నూ శృంగార రసంలో జీవించేసి...తనలో కూడా ఇలాంటి యాంగిల్ ఒకటి ఉందని చూపించింది. గులాబీ రంగు లంగాఓణీతో వయ్యారాలు ఒలకబోస్తూ శృంగార రసాన్ని ఒలికబోస్తూ ఓ రేంజ్ పెర్పామెన్స్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ శివజ్యోతికి తగ్గట్టుగా కరుణ రసం ఇవ్వగా ఆమె ఏడుపులతో అదరగొట్టేసింది. అనంతరం బాబా భాస్కర్ బీభత్సం, శ్రీముఖి రౌద్ర రసాలని ఓ రేంజ్ లో పండించి వందకు వంద మార్కులు తెచ్చుకున్నారు. అలాగే అలీ వీరం, రాహుల్ భయానకం చేసి పర్వాలేదనిపించారు.

వితికాకు అద్భుత రసం ఇస్తే...ఆమె దాన్ని వదిలేసి వరుణ్ తో కలిసి రొమాన్స్ చేసింది. చివర్లో మహేష్ కు హాస్య రసం ఇచ్చారు. మహేష్ బాబా సపోర్ట్ తీసుకుని ముత్యాలు వస్తావా అనే సాంగ్ కి కామెడీగా డ్యాన్స్ చేస్తూ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించారు. ముఖ్యంగా బాబా అయితే లేడీలాగా డ్యాన్స్ వేస్తూ అదరగొట్టేశారు. బాబా హావభావాలకే నవ్వు ఆగలేదు. నాగార్జున సైతం వారి ప్రదర్శన చూసి విజిల్ కొట్టారు. దీంతో మహేష్ పర్ఫార్మన్స్ కూడా వందకు వంద మార్కులు వచ్చేశాయి.