Begin typing your search above and press return to search.

బిగ్ బాస్: లోబోది ఓవర్ యాక్షనా? కామెడీనా?

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:30 PM GMT
బిగ్ బాస్: లోబోది ఓవర్ యాక్షనా? కామెడీనా?
X
లోబో.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ కమెడియన్ డిఫెరెంట్ యాస, భాషతో అలరిస్తున్నాడు. అతడి మేనరిజమే పూర్తి డిఫెరెంట్ గా ఉంటుంది. లోబోను ఒకసారి చూసిన వాళ్లు ఎవరూ జీవితంలో అతడిని మరిచిపోలేరు. లోబో వేషధారణ, ప్రవర్తన అంతా డిఫెరెంట్ గా ఉంటుంది. మా టీవీ మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలైన లోబో ప్రస్థానం అనంతరం కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించేదాకా ఎదిగింది. అయితే లోబోకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.

నాటు మాస్ క్యారెక్టరైజేషన్ అతడిలో ఉండడంతో అందరికీ చేరువ కాలేదని తెలుస్తోంది. గతంలోనే ఓ సారి బిగ్ బాస్ షోకు ఎంపికైన లోబో.. ఆ విషయాన్ని లీక్ చేయడంతో చివరిక్షణంలో అతడిని తప్పించారని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

తాజాగా బిగ్ బాస్ సీజన్ 5లో లోబో చాన్స్ దక్కించుకున్నాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి లోబో తనదైన ముద్ర వేస్తున్నాడు. మొదటి రోజు మాత్రమే కాదు.. రెండోరోజు సైతం తన యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.

తాజాగా బిగ్ బాస్ లో ‘బాత్ రూమ్స్ బాధ్యతను, క్లీనింగ్ షెక్షన్ ను’ లోబో తీసుకున్నాడు. అక్కడ విడిచిన బట్టలను తగిలించుకోవడానికి కొక్కాలు లేవని..వాటిని తక్షణమే బిగ్ బాస్ నిర్వాహకులు ఇవ్వాలంటూ కెమెరా ముందే గట్టిగా చెప్పాడు.

ఇక అదే సమయంలో శ్వేత వర్మతోనూ కాస్తంత స్వరం పెంచి మాట్లాడాడు. ఈ విషయంలోనే కాదు.. ఎవరూ లోబోతో మాట్లాడినా దురుసుగా.. కామెడీ పండిస్తూ తన యాటిట్యూడ్ ను లోబో చూపిస్తున్నాడు.

రెండోరోజే సిరితో గొడవ పెట్టుకున్న లోబో ఇద్దరూ కలిసి తిట్టుకోవడం చూసి నిజంగా అంతా భయపడ్డారు. కానీ అదంతా ఫ్రాంక్ అని తెలియడంతో లోబో తీరుపై కంటెస్టెంట్స్ అంతా ముక్కున వేలేసుకున్నారు.

ఇక సిగరెట్ తాగుతూ కంటెస్టెంట్ సరయుతో లోబో ఇంట్లోని వారిపై చాడీలు చెప్పిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఎక్స్ ట్రా డోస్ యాడ్ చేస్తూ లోబో ముందుకెళుతున్నాడు. ఈ విషయాన్ని లోబో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని వ్యూవర్స్ అంటున్నారు.