Begin typing your search above and press return to search.

ఎమోషనల్‌ అయిన బిగ్ బాస్ లాస్య

By:  Tupaki Desk   |   11 Jan 2021 3:37 PM IST
ఎమోషనల్‌ అయిన బిగ్ బాస్ లాస్య
X
యాంకర్‌ గా సుదీర్ఘ కాలం పాటు తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్‌ చేసిన లాస్య ఆమద్య బుల్లి తెరకు బ్రేక్‌ ఇచ్చింది. ఏవో కారణాల వల్ల బ్రేక్ ఇచ్చిన లాస్య మళ్లీ లాస్య టాక్స్‌ అనే యూట్యూబ్‌ చానెల్‌ ను ప్రారంభించిన తన విషయాలను వంటలను వ్లాగ్‌ గా చూపించే ప్రయత్నం చేస్తూ సందడి చేసింది. ఆమెకు మళ్లీ మంచి ఇమేజ్ రావడంతో లాస్య ను బిగ్ బాస్ షో లోకి ఆహ్వానించడం జరిగింది. చిన్న బాబు ఉన్నా కూడా ఆమె షో లో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. లాస్య మంచి ఎంటర్ టైన్‌ మెంట్‌ ను హౌస్‌ లో ఇచ్చింది. బయటకు వచ్చిన తర్వాత లాస్య యూట్యూబ్‌ ఛానెల్‌ ను మరింత యాక్టివ్‌ చేసింది. వరుసగా వీడియోలను పెట్టింది. ఇలాంటి సమయంలో లాస్య యూట్యూబ్‌ అకౌంట్‌ హ్యాక్ అయ్యింది.

యూట్యూబ్‌ లో ఉన్న లాస్య వీడియోలు కొన్ని మిస్ అవ్వడంతో పాటు ఏదో లైవ్‌ రావడంతో మొత్తం గందరగోళంగా మారిపోయింది. దాంతో లాస్య తన సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ పై స్పందిస్తూ చాలా కష్టపడి వీడియోలు చేశాను. ఆ వీడియోలు మాయం అవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది లాస్య టాక్స్ ఛానల్‌ ను ఆధరిస్తున్నారు. వారందరికి కూడా కృతజ్ఞతలు. అతి త్వరలోనే ఛానెల్‌ వస్తుందని లాస్య పేర్కొంది. ఆమె టీమ్ యూట్యూబ్‌ వారితో చర్చలు జరిపి వర్కౌట్ చేసి ఛానెల్‌ ను తీరిగి తీసుకు వచ్చారు.