Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ : ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో బయటకు జెస్సీ

By:  Tupaki Desk   |   9 Nov 2021 10:37 AM GMT
బిగ్ బాస్ : ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో బయటకు జెస్సీ
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక సాదారణ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ర్యాంప్ వాకర్‌ కమ్‌ మోడల్‌ జెస్సీ అనూహ్యంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. తన అమాయకత్వంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా షన్నూ మరియు సిరిలతో ఇతడి స్నేహం అందరిని ఆకట్టుకుంటుంది. వీరి ముగ్గురికి త్రిమూర్తులు అనే పేరును పెట్టారు. షన్నూ మరియు సిరిల వల్ల సేవ్‌ అవుతూ వస్తున్నాడు అంటూ కొందరు జెస్సీని విమర్శిస్తున్నారు. అయినా కూడా జెస్సీ సాధ్యం అయినంతగా తాను ఒంటరిగానే గేమ్‌ ఆడుతూ వచ్చాడు. తన గేమ్‌ తో కెప్టెన్ గా కూడా అయ్యాడు. ఇన్నోసెంట్ జెస్సీ అంటూ అందరితో ప్రశంసలు దక్కించుకున్న అతడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.

కంటి చూపు కూడా సరిగా లేకపోవడంతో పాటు పదే పదే వాంతులు అవ్వడం.. తలంతా నొప్పిగా ఉండటం వంటివి జరుగుతున్నాయట. దాంతో బిగ్‌ బాస్‌ టీమ్ అతడికి పదే పదే హౌస్‌ లోనే చికిత్స అందించినా కూడా అతడికి పూర్తిగా నయం అయినట్లుగా లేదు. అందుకే అతడిని మరింతగా పరీక్షించేందుకు ఆసుపత్రికి తరలించారు. బిగ్ బాస్ హౌస్‌ లో అనారోగ్యం పాలయితే మొదటి ప్రయత్నంగా ఆసుపత్రికి తరలించి.. మళ్లీ హౌస్ లోకి తీసుకు వస్తారు. ఇప్పుడు బిగ్‌ బాస్ హౌస్‌ నుండి జెస్సీని బయటకు పంపిస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే అతడు రాకపోవచ్చు అని కొందరు అనుకుంటూ ఉన్నారు. కాని ఖచ్చితంగా జెస్సీ రీ ఎంట్రీ ఉంటుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

బిగ్‌ బాస్ విశ్లేషకులు పలువురు జెస్సీ ని సీక్రెట్ రూమ్ లో వారం రోజులు ఉంచే అవకాశం ఉందని అంటున్నారు. జెస్సీ సీక్రెట్ రూమ్ కు వెళ్లి అక్కడ నుండి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడు. ఈవారం జెస్సీ నామినేషన్స్ లో లేడు. అలాగే నామినేట్‌ అయిన వారు కూడా ఎవరు ఎలిమినేట్‌ అవ్వబోవడం లేదు అంటున్నారు. ఈ వారం రవి.. కాజల్‌.. సన్నీ.. మానస్ మరియు సిరి లు నామినేషన్స్‌ లో ఉన్నారు. వారిలో ఎవరు వెళ్లక పోవచ్చు అంటున్నారు. నేటి ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోలో జెస్సీ మరియు షన్నూ ఇంకా సిరిలు చాలా ఎమోషనల్‌ అయ్యారు. ముగ్గురి బాండింగ్‌ చాలా బాగుంటుంది. ఆ విషయం అందరికి తెల్సిందే. జెస్సీ వెళ్లి పోతుంటే ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్‌ అయ్యారు. ముఖ్యంగా సిరి మరియు షన్నూలు బరస్ట్‌ అయ్యారు. అయితే జెస్సీ మళ్లీ వస్తాడని కొందరు ఇంటి సభ్యులు నమ్మకంగా ఉన్నారు. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడు అనేది చూడాలి.