Begin typing your search above and press return to search.

శ్రీముఖికి షాకిచ్చిన బిగ్ బాస్

By:  Tupaki Desk   |   9 Aug 2019 4:50 AM GMT
శ్రీముఖికి షాకిచ్చిన బిగ్ బాస్
X
బిగ్ బాస్ మూడో వారం హాట్ హాట్ గా సాగుతోంది. ఇప్పటికే టాస్క్ లు - గేమ్ లు - లొల్లిలతో ఆసక్తికరంగా మారిన బిగ్ బాస్ లో గురువారం మరింత రంజైన ఆట సాగింది. ఎలిమినేషన్ లో అందరూ ఉద్దండ పిండాలైన కంటెస్టెంట్లే ఉండడంతో ఒత్తిడితో గొడవలకు దిగుతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా వాగ్వాదాలు చేసుకుంటూ హౌస్ లో కాకపుట్టిస్తున్నారు.

బిగ్ బాస్ మొదటి వారం హేమ ఎలిమినేట్ కాగా.. రెండో వారం టీవీ9 జాఫర్ వైదొలిగాడు. ఇప్పుడు మూడో వారం ట్రాన్స్ జెండర్ తమన్నా - పునర్నవి - రాహుల్ - బాబా మాస్టర్ - వితిక లు ఉన్నారు. వీరంతా ఒత్తిడిలో ఊరికే గొడవలు పెట్టుకుంటున్నారు.

గురువారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ హౌస్ లో ఉద్రిక్తతకు దారితీసింది. భౌతికంగా దాడి చేసే వరకు పరిస్థితి వెళ్లింది. గాజు పెట్టెలోని డబ్బులను కొట్టేయడానికి శ్రీముఖి డంబెల్ తో వచ్చి గాజు గ్లాస్ ను పగుల కొట్టడం .. ఆ అద్దాలు రవికృష్ణ చేతికి తగిలి రక్తస్రావం కావడం దుమారం రేపింది. శ్రీముఖి చేసిన ఈ పనికి అందరూ ఆమెను తిట్టిపోశారు.

బిగ్ బాస్ ఇంటి వస్తువును పగులకొట్టడంపై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. ఇంటిసభ్యుల అతి ఉత్సాహాన్ని తిట్టి పోశారు. బిగ్ బాస్ గాజు గ్లాస్ ను పగులకొట్టిన శ్రీముఖిపై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. దీనికి శిక్షగా ఆమెను వచ్చేవారం ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ చేశారు.

ఇక ప్రతీవారం ఎలిమినేషన్ లో ఉంటూ టార్గెట్ చేశారని విలపిస్తున్న పునర్నవికి బిగ్ బాస్ ఊరటనిచ్చారు. ఆమె సీక్రెట్ టాస్క్ చేస్తే సక్సెస్ అయితే వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవుతారని మెలికపెట్టారు. అందరూ పడుకున్నాక ఉదయం 7.30 గంటలకు సీక్రెట్ రూంలోకి వెళ్లడం.. ఆమెను ఇంటి సభ్యులు ఆహార పదార్థాలు త్యాగం చేసి రప్పించడంతో పునర్నవి వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. ఈమెతో పాటు అలీ రెజాకు ఈ సేమ్ టాస్క్ తో బిగ్ బాస్ తప్పించాడు.