Begin typing your search above and press return to search.

కాంఛన-3లో సెన్సేషనల్ హీరోయిన్

By:  Tupaki Desk   |   8 Dec 2017 11:42 AM IST
కాంఛన-3లో సెన్సేషనల్ హీరోయిన్
X
రాఘవ లారెన్స్ తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్ గా నిలబెట్టిన సినిమా ‘కాంఛన’. సౌత్ ఇండియాలో హార్రర్ కామెడీ జానర్ కు గొప్ప డిమాండ్ తీసుకొచ్చిన సినిమా కూడా ఇది. ‘ముని’కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన కాంఛన-2 (గంగ) కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీని కొనసాగిస్తూ.. లారెన్స్ ఇప్పుడు కాంఛన-3 తీస్తున్నాడు. కొన్ని రోజుల కిందటే సైలెంటుగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు లారెన్స్. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుందని ఇంతకుముందు ప్రచారం జరిగింది కానీ.. అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

తమిళ ‘బిగ్ బాస్’ షోతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న సెన్సేషనల్ హీరోయిన్ ఒవియా ‘కాంఛన-3’లో కథానాయికగా నటిస్తుండటం విశేషం. లారెన్స్ తో కలిసి ఒవియా షూటింగులో పాల్గొంటున్న సందర్భంగా ఆన్ లొకేషన్ పిక్ కూడా ఒకటి బయటికి వచ్చింది. ‘బిగ్ బాస్’ తర్వాత ఒవియా పాపులారిటీని వాడేసుకుందామని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆమె ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది. ఒవియా రీఎంట్రీలో ఎంచుకున్న పెద్ద సినిమాల్లో ఇదొకటి. హార్రర్ కామెడీ జానర్ జోరు తగ్గిపోతున్న దశలోనూ ‘కాంఛన-2’ సక్సెస్ కొట్టాడు లారెన్స్. ఇప్పుడు ఆ జానర్ దాదాపుగా ఔట్ డేట్ అయిపోయినట్లే ఉంది. మరి ఇప్పుడు కూడా అతను విజయవంతమవుతాడేమో చూడాలి.