Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కంటెస్టెంట్ సూసైడ్ అంటెప్ట్.. కాపాడిన హీరో కు థ్యాంక్స్

By:  Tupaki Desk   |   28 July 2020 2:30 AM GMT
బిగ్ బాస్ కంటెస్టెంట్ సూసైడ్ అంటెప్ట్.. కాపాడిన హీరో కు థ్యాంక్స్
X
కన్నడ బిగ్ బాస్ సెలెబ్రెటీ జయశ్రీ రామయ్య కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్యకు ప్రయత్నించగా.. హోస్ట్ అయిన హీరో కిచ్చా సుదీప్ కాపాడడం సంచలనంగా మారింది. మానసిక క్షోభ వల్లే జయశ్రీ ఇలా ఆత్మహత్యయత్నం చేసినట్టు తెలిసింది.

తాను డిప్రెషన్, తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని.. దానిని జయించాలంటే మరణం ఒక్కటే నా ముందు ఉన్న మార్గం అని జయశ్రీ వాపోయింది. ఆర్థిక సమస్యలు లేవని తెలిపింది. వ్యక్తిగత సమస్యలు తనను కృంగదీస్తున్నాయని.. వాటిని అధిగమించలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు జయశ్రీ వీడియోలో వాపోయింది.

జీవితంలో ఓడిపోయానని.. తనకు మెర్సీ కిల్లింగ్ కల్పించండని ఫేస్ బుక్ లైవ్ లో జయశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.ఆ తర్వాత హీరో కిచ్చా సుదీప్ చొరవతో జయశ్రీ ఆత్మహత్య యత్నాన్ని విరమించుకుంది.

తాజాగా సుధీప్ ఇచ్చిన ధైర్యంతో మాములు మనిషిగా మారింది. జయశ్రీ జీవితం గాడిలో పడింది.తన తప్పు తెలుసుకొని సుధీప్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖను రాసింది.మీ రుణం తీర్చుకోలేనంటూ లేఖలో పేర్కొంది. నా జీవితాన్ని కాపాడారంటూ ట్వీట్ చేసింది.