Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ బ్యూటీ జాక్ పాట్.. బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   9 March 2021 4:30 AM GMT
బిగ్ బాస్ బ్యూటీ జాక్ పాట్.. బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన ప్రభుత్వం!
X
హారిక అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.. కానీ, దేత్త‌డి హారిక అంటే మాత్రం అంద‌రికీ తెలుసు. యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపుల‌ర్ అయిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ‘బిగ్ బాస్-4’ కంటిస్టెంట్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ రియాలిటీ షోలో తనదైన ఆటతీరుతో అందరినీ కట్టిపడేసింది.

ఒక దశలో ఫైనలిస్టుగా నిలుస్తుందని, టైటిల్ కూడా తనకే దక్కుతుందనే ప్రచారం కూడా సాగింది. హౌజ్ లో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకుంది హారిక. అయితే.. ఆమెకు బిగ్ బాస్ టైటిల్ దక్కకపోయినప్పటికీ.. అంతకు మించిన అద్భుతమైన గౌరవం దక్కింది.

దేత్తడి హారికను టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా.. ఆమెకు నియామక పత్రం అందించారు.

యూట్యూబ్ లో హారిక వీడియోలకు ఫుల్లు ఫాలోయింగ్ ఉంది. ఆమె వీడియోలు మిలియ‌న్ల‌కొద్దీ వ్యూస్ రాబ‌ట్టాయి. ఆ పాపులారిటీ ద్వారానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నిలిచింది. ఆల్ ది బెస్ట్ హారిక.